NewsOrbit
న్యూస్

మహారాష్ట్రలో జులై 31వరకు లాక్‌డౌన్

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు రోజుకు 20 వేల వరకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కేసులు అధికం అవుతున్న రాష్ట్రాల్లో జిల్లాలు, ప్రాంతాల వారీగా లాక్‌డౌన్‌ లను అమలు చేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ లకు పూర్తి అధికారాలు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల తీవ్రత ఆధారంగా ఆంక్షలను విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం కాని కార్యకలాపాలను కఠినంగా కట్టడి చేయాలని పేర్కొన్నది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల నమోదులో మహారాష్ట్రనే అగ్ర స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా నేటి వరకు 5 లక్షల 48 వేల పై చిలుకు కేసులు నమోదు కాగా మహారాష్ట్ర నుండే లక్షా 64 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు ఆయ్యాయి. వీరిలో వైద్య సేవల అనంతరం 86,575 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 7,429 మంది మృతి చెందారు. ప్రస్తుతం 70,607 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర తరువాత స్థానంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీలో నేటి వరకు 83,077 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 82, 275 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తరువాతే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల జాగ్రత్తపై హెచ్చరికలు జారీ చేస్తూ సూచనలు ఇస్తున్నా చాలా ప్రాంతాలలో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. ఈ కారణంగా కరోనా మహమ్మారి పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N