Liger : లైగర్ కి మళ్ళీ కరోనా దెబ్బ..ముంబై నుంచి సర్దేసుకొని వస్తున్నారా..?

Share

Liger : లైగర్.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా 40 శాతం షూటింగ్ అయ్యాక బ్రేక్ పడింది. ఎట్టకేలకి మళ్ళీ షూటింగ్ మొదలై జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతుండగా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా లైగర్ సినిమా మళ్ళీ షూటింగ్ ముంబైలో నిలిపివేసినట్లు తెలుస్తుంది.

carona-second-wave-effects-liger
carona-second-wave-effects-liger

కరోనా కారణంగా అటు సామాన్య ప్రజలలోనే కాదు ఇటు సినీ సెలెబ్రిటీలలో కూడా ఆందోళనలు మళ్ళీ మొదలయ్యాయి. బాలీవుడ్ .. టాలీవుడ్ సినీ ప్రముఖులకే మళ్ళీ కరోనా సోకి వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మహమ్మారి కారణంగా ఎన్నో నష్టాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా ప్రభావం వలన కొందరు డైరెక్టర్స్ యాక్టర్స్ తమ షూటింగ్ లను నిలిపి వేసారు. లక్షల్లో కరోనా కేసులు బయటపడటంతో త్వరలోనే అన్ని సినిమాలకు బ్రేక్ పడేలా ఉందని సమాచారం.

Liger : ఇక్కడే లైగర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి..!

ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ – పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్’కి బ్రేక్ వేయక తప్పలేదని అంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ముంబైలో విస్తృతమవుతున్న కారణంగా ఈ సినిమాకు ముంబైలో ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ కు బయలుదేరిందట లైగర్ చిత్ర బృందం. త్వరలోనే పూరీ బృందం హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టి ఇక ఇక్కడే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.


Share

Related posts

ముగిసిన మూడో దశ పోలింగ్

sarath

Dinosaur fossils: కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చిన డైనోసార్ శిలాజాలు.. !

Naina

యాక్షన్ కి రియాక్షన్ ఇస్తా.. గాజులు తొడుక్కోలేదు: వర్మ

Muraliak