తెలంగాణ‌ న్యూస్

Mango videos: మ్యాంగో వీడియోస్ సంస్థ కార్యాలయంపై గౌడ సంఘీయుల దాడి..ఎందుకంటే..?

Share

Mango videos: మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత, సింగర్ సునీత భర్త రామ్ ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో యూట్యూబ్ ఛానల్ కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించాయి. విషయం ఏమిటంటే ఇటీవల మ్యాంగో వీడియోస్ సంస్థ ప్రసారం చేసిన వీడియో వివాదాస్పదం అయ్యింది. ఇందులో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ ఆ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

case registered on Mango videos ram
case registered on Mango videos ram

 

Mango videos: మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ పై ఫిర్యాదు

గౌడ మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వీడియోలు ప్రసారం చేసిన రామ్ తక్షణం ఆ వీడియోలను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మ్యాంకో వీడియోస్ సంస్థ కార్యాలయాన్ని గౌడ సంఘాల నేతలు ముట్టడించి రామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ పై గౌడ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై రామ్ ఇంత వరకూ స్పందించలేదు.


Share

Related posts

మన స్టార్ హీరోలు అక్కడ ఖాన్ త్రయాన్ని వెనక్కి నెట్టగలరా ..?

GRK

రాజధాని గ్రామాల్లో నందమూరి సుహాసిని

somaraju sharma

చిరుద్యోగులకు “ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్” యోజన

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar