NewsOrbit
న్యూస్

టీడీపీ మాజీలపై వేలాడుతున్న కత్తి..!!

cases and allegations on ex tdp leaders

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ టీడీపీ మాజీ మంత్రులపై ఆరా తీస్తూనే ఉంది. ఎక్కడ ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కేసులు పెట్టేందుకు వెనుకడటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వరకూ కొనసాగుతోంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో మాజీ టీడీపీ నాయకుడు వరపుల రాజాపై అవినీతి ఆరోపణల వస్తున్నాయి. సహకార సంఘంలో 16కోట్ల అవినీతి జరిగిందని.. ఇందులో వరపుల రాజా పాత్ర ఉందని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

cases and allegations on ex tdp leaders
cases and allegations on ex tdp leaders

పరపుల రాజాపై ఆరోపణలు ఇవే..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం సహకార సంఘం లంపకలోవ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు వరుపుల రాజా గతంలో అధ్యక్షుడిగా పని చేశారు. రాజా హయాంలో 11.05.2018 – 30.07.2019 మధ్య కాలంలో రూ.16,47,59,023 కోట్ల మేర దుర్వినియోగానికి పాల్పడ్డారని  అభియోగాలు వచ్చాయి. దీనిపై పెద్దాపురం డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణా రావు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో రాజాపై క్రిమినల్ కేసు నమోదు అయింది. రాజాతోపాటు మరో నలుగురు అధికారులు, ఇద్దరు మాజీ సీఈఓలు, ఇద్దరు మాజీ బ్రాంచి మేనేజర్లను కూడా సహ నిందితులుగా పేర్కొన్నారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు, ఒకే పేరుపై అనేక రుణాలు, మృతుల పేర్లపై రుణాలు, 450 నకిలీ పాస్ పుస్తకాలపై రుణాలు మంజూరు చేశారంటూ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాజా హయాంలోనే ఇవి జరిగాయని అంటున్నారు. దీంతో రాజా అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.

మరింత లోతుకు తవ్వుతున్నారు..

ఇప్పటివరకూ జరిగిన అరెస్టులతోపాటు ఇకపై కూడా మరిన్ని అరెస్టులు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రుల నుంచి జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేల వరకూ వీరిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జరిగిన అవినీతి పనులపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారం అండతో ఆనాటి టీడీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని నియోజకవర్గాల స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీడీపీ మాజీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటివరకూ జరిగిన అరెస్టులు.. ఇకపై ఎన్ని అరెస్టులు జరుగుతాయోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

author avatar
Muraliak

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju