Cash : జబర్దస్త్ కమెడియన్ల సక్సెస్ వెనుక ఇంత కష్టం ఉందా?

jabardasth comedians in cash program
Share

Cash : క్యాష్ ప్రోగ్రామ్ అంటేనే స్పెషల్. ఆ స్పెషల్ ప్రోగ్రామ్ కు యాంకర్ సుమ స్పెషల్ అట్రాక్షన్. ఆమె లేకుంటే అసలు క్యాష్ ప్రోగ్రామే లేదు. తన టైమింగ్ కామెడీ, పంచులు మామూలుగా ఉండవు. అందుకే.. తనను తమ ప్రోగ్రామ్స్ లో తీసుకోవాలని అన్ని చానెల్స్ తెగ ప్రయత్నిస్తుంటాయి. సుమకు ఉన్న డిమాండ్ అటువంటిది మరి. ఈటీవీలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్ క్యాష్. ఈ షోకు కొందరు గెస్టులను పిలిచి… చేసే సందడి మామూలుగా ఉండదు.

jabardasth comedians in cash program
jabardasth comedians in cash program

తాజాగా ఈ షోకు జబర్దస్త్ కమెడియన్లు వచ్చారు. వీళ్లంతా టీమ్ లీడర్లు కాదు కానీ… టీమ్ లో ఉండి సపోర్ట్ చేసే క్యారెక్టర్లు. జీవన్, దుర్గారావు, ఆనంద్, బాబీ, అశోక్, కొమురం, రాజమౌళి లాంటి కమెడియన్లు అందరూ షోకు వచ్చి చేసిన రచ్చ మామూలుగా లేదు.

సాధారణంగా ఈ గ్యాంగ్ ఎక్కడుంటే అక్కడ రచ్చే. కానీ.. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లో వీళ్లు వచ్చి కాసేపు సందడి చేసి… ఆ తర్వాత అక్కడున్న వాళ్లనే కాదు ప్రేక్షకుల చేత్తో కూడా కంటతడి పెట్టించారు.

Cash : జబర్దస్త్ లో నిలదొక్కుకోవడానికి వీళ్లు పడ్డ కష్టాలను సుమక్కతో పంచుకున్నారు

అయితే… క్యాష్ షో వచ్చి… కాసేపు సుమక్కతో కలిసి తెగ సందడి చేశారు వీళ్లంతా. ఆ తర్వాత కొమురం తన కష్టాలను చెప్పుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చాక… కొమురం అక్క అనే ఒక ప్రత్యేక గుర్తింపుతో ప్రస్తుతం రాణిస్తున్నాడంటే అది అంత ఈజీగా అయిన పని కాదు. దాని కోసం ఎంతో కష్టపడ్డాడట. అలాగే జీవన్ కూడా అంతే. తను జబర్దస్త్ కు వచ్చిన మొదట్లో ఎన్నో సార్లు స్కిట్లలో చేసినప్పటికీ… ఎడిటింగ్ లో మనోడిని తీసేశారట. అలా ప్రతిసారీ అలాగే చేశారట. చివరకు తన టాలెంట్ ను గుర్తించి టీమ్ లీడర్ ను చేశారట.

ఇలా జబర్దస్త్ లో పనిచేసే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ది ఒక్కో కథ. ఒక్కో గాథ. వాళ్ల సంతోషాలు, బాధల గురించి తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం…. క్యాష్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి మరి.

https://www.youtube.com/watch?v=xmj5j3vUraU


Share

Related posts

Relationship Tips: శృంగార జీవితం అద్భుతం గా ఉండాలంటే ఈ మార్గాన్ని ఎంచుకోండి!!

Kumar

ఆచార్య క్లారిటీగా ఉన్నా వాళ్ళు అనవసరంగా అత్యుత్సాహం చూపిస్తున్నారు ..ఏంటీ విషయం ..?

GRK

Money Earning : మీ మొబైల్ లో ఇంటర్నెట్ ఉందా.. అయితే డబ్బు సంపాదించండిలా..!!

bharani jella