cash latest promo in etv telugu
క్యాష్ షో తెలుసు కదా. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ప్రస్తుతం బాగానే రేటింగ్స్ సంపాదిస్తోంది. ఆ షోకు వచ్చే వాళ్లు చేసే సందడితో పాటు యాంకర్ సుమ సందడి ఈ షోకు ప్లస్ పాయింట్ అవుతోంది.
తాజాగా ఈ షోలో పాల్గొన్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా? ఓ ఐదారేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తారలు గుర్తున్నారా? అదేనండి.. ఈషా చావ్లా, కామ్నా జెఠ్మలానీ. వీళ్లిద్దరూ ఎక్కువగా అల్లరి నరేశ్ తో సినిమాల్లో నటించారు.
వీళ్లే కాకుండా.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ కూడా ఈ షోలో పాల్గొన్నది. అలాగే.. సంగీత తెలుసు కదా. సంగీత ప్రస్తుతం బుల్లితెరపై బాగానే కనిపిస్తోంది. కొన్ని షోలలో హోస్ట్ గానూ చేస్తోంది.
ఇక.. ఈ నలుగురు కలిసి యాంకర్ సుమతో కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేశారు. ఈసందర్భంగా సంగీతను సుమ ఒక ప్రశ్న అడిగింది. మళ్లీ అవకాశం వస్తే.. శ్రీకాంత్ తో కలిసి నటిస్తావా? లేక రవితేజతోనా? అని అడిగేసరికి.. సంగీత ఏమాత్రం తడుముకోకుండా.. శ్రీకాంత్ అన్నయ్య అని అనేసింది. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శ్రీకాంత్ అన్నయ్య అయితే.. మరి రవితేజ ఏమవుతాడు? అంటూ సుమ.. సంగీతను ప్రశ్నించింది.
దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…