ట్రెండింగ్ న్యూస్ సినిమా

Cash : వామ్మో.. పవన్ కళ్యాణ్ కళ్లంటే పడిచచ్చిపోతుంట మాధవీలత? ఇప్పటికీ ప్రేమిస్తోందట?

Cash వామ్మో పవన్ కళ్యాణ్ కళ్లంటే పడిచచ్చిపోతుంట మాధవీలత ఇప్పటికీ ప్రేమిస్తోందట
Share

Cash : క్యాష్ Cash  ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాష్ ప్రోగ్రామ్ తెలుగు బుల్లితెర మీదనే టాప్ ప్రోగ్రామ్ గా నిలుస్తోంది. జబర్దస్త్ కామెడీ షోకు దీటుగా నడుస్తోంది ఈ షో. ప్రతి వారం ఈ షోకు కొందరు సినీ సెలబ్రిటీలను గెస్టులుగా పిలుస్తారు. వాళ్లతో కలిసి సరదాగా ఆడటం, పాడటం.. లాంటివి చేసి ప్రేక్షకులను నవ్వించడమే క్యాష్ ప్రోగ్రామ్ ప్రత్యేకత.

Cash program latest promo released
Cash program latest promo released

ఈవారం గెస్టులుగా హీరోయిన్ మాధవీలత, జబర్దస్త్ అధిరే అభి, హిమజ, చలాకీ చంటీ వచ్చారు. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుందరి మాధవీలత. ఆ తర్వాత మాధవీలత చాలా సినిమాల్లో నటించినా.. హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ కాలేకపోయింది. కానీ.. తనకు ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్ లు, షార్ట్ మూవీస్ ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

తాజాగా క్యాష్ షోలో సందడి చేసిన మాధవీలత… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు విని క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చిన వాళ్లంతా షాక్ అయ్యారు.

Cash : పవన్ కళ్యాణ్ కు 14 పేజీల ప్రేమలేఖ రాశా

ఈసందర్భంగా యాంకర్ సుమ.. మాధవీలతను ఓ ప్రశ్న అడుగుతుంది. నీకు ఖుషీ సినిమా అంటే ఇష్టమా? లేక అత్తారింటికి దారేది సినిమా అంటే ఇష్టమా? అని. దీంతో మాధవీలత.. తనకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రష్ ను ఈసందర్భంగా చెబుతుంది. అఫ్ కోర్స్ నాకు ఖుషీ సినిమా అంటేనే ఇష్టం. కాలేజీ బంక్ కొట్టి మరీ ఖుషీ సినిమాకు వెళ్లాను. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ కళ్లు చూసి పడిపోయా. ఆయన కళ్లంటే చాలా ఇష్టం. పవన్ కు అప్పట్లోనే 14 పేజీల ప్రేమ లేఖ రాశాను అంటూ మాధవీలత తన మనసులో మాటను బయటపెట్టింది.

క్యాష్ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి.

 


Share

Related posts

Rice Water: బియ్యం కడిగిన నీరు పారబోస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

bharani jella

జ‌గ‌ప‌తిబాబు@ స్కార్.. పి.ర‌విశంక‌ర్ @ ముఫార్

Siva Prasad

Bheemla nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా విషయంలో ఒక బ్యాడ్ న్యూస్..!

GRK