Cashew Milk: ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్ర లేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నిద్ర సరిగా పట్టకపోతే మనిషికి అన్ ఈజీగా ఉంటుంది. దేనిపైనా దృష్టి పెట్టలేరు. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎక్కువ మంది రాత్రి సమయంలో సరైన నిద్ర పోవడం లేదు. నిద్ర లేమి వల్ల బాధపడుతున్న వారు ముందుగా మందులు ట్రై చేయకుండా చిట్కా వైద్యంతో ఉపశమనం పొందవచ్చు. మంచి నిద్ర కోసం జీడిపప్పు పాలు తాగవచ్చు. ఇది చాలా ప్రభావితంగా పని చేస్తుంది. జీడిపప్పు పాలు ఎలా తయారు చేసుకోవచ్చు. వాటి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందా.
Cashew Milk: జీడిపప్పు పాలు తయారీ విధానం
మూడు – నాలుగు జీడిపప్పులు తీసుకుని ఒక కప్పు పాలలో నానబెట్టాలి. వాటిని నాలుగు అయిదు గంటలు నాన నివ్వాలి. ఆ తరువాత నానబెట్టిన జీడిపప్పు ను తీసుకుని దంచాలి. వాటిని పాల గిన్నెలో వేయాలి. రుచి కోసం కొంచెం చక్కెర ను కలపాలి. అనంతరం కొద్దిసేపు మరిగించాలి. ఆ తరువాత దాన్ని సేవించవచ్చు. దీన్ని వేడిగా లేదా చల్లగా తీసుకోవచ్చు.
రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ జీడిపప్పు పాలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు వైద్య నిపుణులు. దీని వల్ల మంచి నిద్ర పట్టడంతో పాటు మరుసటి రోజు తాజాగా ఉండటానికి పని చేస్తుందట. జీడిపప్పుతో సహా అనేక డ్రై ఫ్రూట్స్ నిద్రకు చాలా మంచివిగా చెబుతుంటారు. ఇది మెలటోనిస్ తో పాటు మెగ్నీషియం, జింక్ వంటి అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. మంచి నిద్ర కోసం జీడిపప్పును ఎప్పుడూ తీసుకోవచ్చు. సాధారణంగానే పాలు బాగా నిద్ర పోవడానికి సహకరిస్తాయి. పాలలో ఉండే ట్రిప్టోఫాస్ వల్ల వృద్ధులలో నిద్ర, మానసిక స్థితి మెరుగుపడుతుంది.