NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

క్యాజినో స్కామ్: వైసీపీ వీళ్లే..!? చీకోటి ప్రవీణ్ కేసులో ఆ పెద్దలు..!?

దేశాన్ని రెండు పెద్ద స్కామ్ లు కుదిపేస్తున్నాయి. ఇందులో ఒకటి పశ్చిమ బెంగాల్ లోని ఒక మంత్రి నివాసంలో నోట్ల కట్టలు దొరకడం, ఆ మంత్రి సన్నిహితురాలి ఇంటిలోనూ భారీ ఎత్తున నోట్ల కట్టలు, అయిదు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు లభించడం. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అవినీతిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి జరిగిన పెద్ద స్కామ్. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకూ 50 కోట్లకుపైగా నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. మరో స్కామ్ క్యాజినో. భారీ ఎత్తున క్యాజినో నిర్వహించే ఇద్దరి నివాసాలు, కార్యాలయాలపై హైదరాబాద్ లో ఈడీ దాడులు చేసి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి క్యాజినో నిర్వహకులు మాధవరెడ్డి, చీకోటి ప్రవీణ్ లను విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏపి, తెలంగాణతో పాటు దేశంలోని కొందరు రాజకీయ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రకరకాల ప్రాంతాల్లో క్యాజినో నిర్వహిస్తున్నారనేది వీళ్ల మీద ఉన్న ప్రధాన ఆరోపణ.

ఈడి తలచుకుంటే..!?

ఈ వ్యవహారంపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. చట్టానికి సహకరిస్తానని పేర్కొన్నారు. వాళ్ల (ఈడీ)కి ఏవో అనుమానాలతో ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు ఇచ్చానని చెప్పారు. అన్ని అనుమతులతోనే గోవాలో ఇతర ప్రాంతాల్లో క్యాజినో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. గోవా, నేపాల్ లలో క్యాజినో నిర్వహణకు చట్టబద్దత ఉందని తెలిపారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చీకోటి ప్రవీణ్ వాడుతున్న కారు కూడా ఓ ప్రజా ప్రతినిధి పేరు మీద ఉన్నట్లు తెలుస్తొంది. మరో విషయం ఏమిటంటే.. చీకోటి ప్రవీణ్ తో ఏపికి చెందిన ఇద్దరు తాజా మాజీ మంత్రులు సన్నిహితంగా వ్యవహరించే వారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రవీణ్ వ్యవహారాల్లో ఇన్వాల్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. చీకోటి ప్రవీణ్ తో కలిసి రకరకాల ప్రాంతాల్లో జరిగిన క్యాజినో నిర్వహణలో వీరు భాగస్వాములు అయ్యారని చెపుకుంటున్నారు. అతను నిర్వహించిన మనీలాండరింగ్ విషయంలో వీరి పాత్ర కూడా ఉందని అనుకుంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ కూడా అప్రమత్తమైంది. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానిపై నివేదిక తెప్పించుకుంటోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో వీరి పాత్ర ఏమైనా ఉందా..? లేక చట్టపరిధిలో జరిగిన కార్యకలాపాల్లోనే పాల్గొన్నారా..? అనే విషయాలపై ఆరా తీస్తొంది. దీని వల్ల పార్టీ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా..? ఆ డ్యామేజీ కంట్రోల్ కు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? అనే విషయాలపై దృష్టి పెట్టింది వైసీపీ.

వైసీపీ నేతలు వీళ్ళే..!?

ఈ క్యజినో వ్యవహారంలో వైసీపీ నేతలు కూడా కొందరు తలదూర్చినట్టు తెలుస్తుంది.. ఈ ఏడాది సంక్రంతికి గుడివాడలో క్యాజినో నిర్వహించిన సంగతి తెలిసిందే.. అది మొత్తం ఈ ప్రవీణ్ ద్వారానే జరిగింది.. ఆ తర్వాత ఏపీలోని అప్పట్లో ఓ మంత్రి (ప్రస్తుత మాజీ మంత్రి) తరచూ విదేశాలకు వెళ్లి జూద క్రీడలు ఆడి వస్తుంటారు.. గతేడాది కూడా రష్యా, శ్రీలంక వెళ్లి వచ్చారనే సంగతి అందరికీ తెలిసిందే.. సో.. ఈ నేతలే కాకుండా నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మల్యేలు, విశాఖ ప్రాంతానికి చెందిన ఓ ఎమెల్యే, సహా మరో ముగ్గురు సీరియస్ గా దీనిలో తలదూర్చినట్టు తెలుస్తుంది..

 

తెలంగాణలోనూ మంత్రిగా ఉన్న ఓ పెద్దాయనతో పాటు ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు అధికార పార్టీ నాయకుల మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంటోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. రాజకీయ ప్రమేయం, లాబీయింగ్ ఉంటుంది. రాజకీయ లాబీయింగ్ నేపథ్యంలో ఈ కేసు కొనసాగిస్తారా..? ముగిస్తారా..? అనేది పార్టీ పెద్దలను బట్టి ఉంటుంది. కేసును రాజకీయంగా వాడుకోవాలంటే కొందరు కేంద్రంలోని పెద్దలు ఈ కేసును క్లోజ్ చేయించే అవకాశాలు ఉంటాయి. ఈ కేసులో పట్టుబిగిస్తారా..? వదిలివేస్తారా..? అనేది రాజకీయంతో ముడిపడి ఉంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి !

author avatar
Special Bureau

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?