న్యూస్

Oil: ఈ ఆయిల్ తో పాదాలకు మసాజ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు..!

Caster Oil Foot Massage benefits
Share

Oil: మనం వర్క్ చేసే ప్లేస్ లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాల్లో నొప్పి, వాపు వస్తుంది.. నిజానికి ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లల్లో రక్త సరఫరా తగ్గుతుంది.. దాని కారణంగా కండరాల్లో నొప్పులు వస్తాయి.. కొన్నిసార్లు ఈ నొప్పి భరించలేనంతగా ఉంటుంది.. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే తరచూ పెయిన్ కిల్లర్ ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. పాదాల వాపు, నొప్పుల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.. రోజు రాత్రి పడుకునే ముందు ఆముదంతో పాదాలకు మసాజ్ చేస్తే కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.. దాంతో మనిషికి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.. పాదాలకు ఆముదంతో మసాజ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు చూద్దాం..!

Caster Oil Foot Massage benefits
Caster Oil Foot Massage benefits

ఆముదం నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. ఇవి దీర్ఘకాలిక నొప్పులను నయం చేస్తుంది. ఆ నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రోజు రాత్రి పడుకునే ముందు ఆముదంతో మసాజ్ చేస్తే చాలా మంచిది. మడమల పగుళ్లను తగ్గించడానికి కూడా ఆముదం అద్భుతంగా సహాయపడుతుంది. ఇందుకోసం పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆముదం తో చీలమండపై మసాజ్ చేయాలి. దీనివల్ల మడమల పగుళ్లు తగ్గిపోతాయి.

ఆముదం నూనెలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి. వేడి చేసిన ఆముదంను ఆముదం ఆకులపై రాసి కాళ్లలో వాపు చోట కట్టాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ ఆముదం ఆకులు లేకపోతే ఆముదంతో వాపు ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేసి గుడ్డతో కట్టి ఉంచాలి. రాత్రంతా ఇలా ఉంచితే వాపులు తగ్గిపోతాయి. ఆముదం నూనె లో గాయాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. ఇంకా కణజాల పెరుగుదల ప్రక్రియలు వేగవంతం చేస్తాయి. అందుకే గాయాలు తగిలిన చోట ఆముదం నూనె రాస్తే త్వరగా అవి మానిపోతాయి..


Share

Related posts

Pregnancy: గర్భం తో ఉన్న నవమాసాలు.. మీద నవగ్రహాల ప్రభావం ఉంటుందా?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి??

siddhu

ఎలా ఉండే సోనూసూద్ చివరికి ఎలా అయిపోయాడో చూడండి…

arun kanna

నాని సినిమాకి బాలీవుడ్ లో కోట్లు కుమ్మరిస్తున్నారట ..?

GRK