Catherine Tresa: కేథరీన్ హీరోయిన్ అని చెప్పుకోవడం దండగ..ఏదో ఫ్లోలో అవకాశాలు అందుకుంది..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడానికి కారణాలు ఇవేనా..?

Share

Catherine Tresa: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ అందంతో, ఫిజిక్‌తో అవకాశాలు అందుకుంటూ నెట్టుకొస్తారు. పూజా హెగ్డే మాదిరిగా కెరీర్ ప్రారంభంలో వరుసగా ఫ్లాప్ వచ్చినా కూడా లక్ ఫేవర్ చేయడంతో పాటు త్రివిక్రం, హరీశ్ శంకర్ లాంటి దర్శకులు సపోర్ట్ చేసి అవకాశాలిస్తే నిలదొక్కుకుంటారు. ఆ తర్వాత అలాంటి అమ్మాయే స్టార్ హీరోయిన్‌గా మారి డేట్స్ సర్దుబాటు చేయడానికి ఖాళీ లేనంత బిజీగా మారుతుంది. ఇక ఎంతమంది సపోర్ట్ చేసినా కొంతమంది మాత్రం పాతాళం నుంచి పైకి రావడానికి ఎవరో ఒకరి వంక చూస్తూనే ఉంటారు.

catherine-tresa-is trolled by netizens
catherine-tresa-is trolled by netizens

అలాంటి హీరోయిన్స్‌లో ఒకరు కెథరీన్ థ్రెసా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ఇద్దరమ్మాయిలతో. ఇందులో అమలా పాల్, కెథరీన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇద్దరినీ పూరి జగన్నాథ్ అద్భుతంగా చూపించాడు. ఇక అల్లు అర్జున్‌తో పాటు కలిసి టాప్ లేచిపోద్ది అనే మాస్ సాంగ్‌లో బన్నీతో పోటీ పడి మరీ స్టెప్పులేసి అదరగొట్టింది. కేథరీన్ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ఈ పాటే. అంతగా మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇద్దరమ్మాయిలు సినిమాలో ఆమె బాగా నటించిందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ తెచ్చుకుంది.

Catherine Tresa: కేథరీన్ సోలో హీరోయిన్‌గా చేసిన ఏ సినిమా కూడా ఆమెకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టలేకపోయాయి.

కానీ ఆ తర్వాత కేథరీన్ సోలో హీరోయిన్‌గా చేసిన ఏ సినిమా కూడా ఆమెకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే తెలుగులో కంటే ఈమె నటించిన సినిమాలు ముందు కన్నడ, మలయాళంలో వచ్చాయి. ఆ సినిమాలు చూసిన దర్శక నిర్మాతలు ఛమ్మక్ ఛల్లో అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో పాటే పూరి జగన్నాథ్ ఇద్దరమ్మాయిలతో సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఛమ్మక్ ఛల్లో సినిమా అనేది ఎవరికీ గుర్తుండకపోయినా ఇద్దరమ్మాయిలతో సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన పైసా సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

అయితే ఈ సినిమా కెథరీన్ బ్యాడ్‌లక్ వల్ల చాలా ఆలస్యంగా రిలీజైంది. ఇందులో ఒకే ఒక్క పాట తప్ప కెథరీన్‌కి క్రేజ్ తీసుకు వచ్చిందేమీ లేదు. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ఎర్రబస్సు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దర్శకరత్న దాసరి నారాయాణ రావు ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత. తాత – మనవడు సెంటిమెంట్తో వచ్చిన దాసరి మొదటి సినిమా మాదిరిగా భారీ హిట్ అవుతుందని అందరూ భావించారు. టైటిల్ అలాగే దాసరి మేకోవర్..పోస్టర్స్, ట్రైలర్ చూసి అందరూ ఈ సినిమా భారీ హిట్ అవుతుందని భావించారు.

Catherine Tresa: ఎర్రబస్సు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

కానీ అందరి అంచనాలు తారుమారవుతూ ఎర్రబస్సు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో టాలీవుడ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కేథరీన్ కెరీర్ మరింతగా దెబ్బతినింది. ఈ సినిమా తర్వాత సోలో హీరోయిన్‌గా ఆమెకి అవకాశాలు దక్కలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో పొగరబోతు ఎమ్మెల్యేగా నటించి ఆకట్టుకుంది. ఒక సాంగ్ కూడా కేథరీన్‌కి బోయపాటి ఇచ్చాడు. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్‌గానూ నిలిచింది. కానీ కేథరీన్‌కి మాత్రం ఈ సినిమా ఉపయోగపడలేదు.

సరైనోడు సక్సెస్ క్రెడిట్ అల్లు అర్జున్ – దర్శకుడు బోయపాటికి వెళ్ళింది. మిగిలిందేదైనా ఉంటే అది రకుల్ దక్కించుకుంది. ఇలా సెకండ్ హీరోయిన్‌గా నటించినా ఆమెకి అనుకున్నంత క్రేజ్ మాత్రం దక్కడం లేదు. ఇంకా చెప్పాలంటే చేసిన సినిమాలలో కేథరీన్‌ది ఓవరాక్షన్ అని చెప్పుకున్నారు..హీరోయిన్ అని ఈమెని అనడం దండగ అని కామెంట్స్ చేశారు. అందుకు ముఖ్య కారణాలు ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడం ఒకటైతే గ్లామర్‌గా ఓకే గానీ, నిజంగా నటన పరంగా యావరేజ్ కంటే తక్కువే అని చెప్పాలి. అదే కెథరీన్ హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడనికి ముఖ్య కారణాలయ్యాయి.


Share

Related posts

ఫ్లాప్ డైరెక్టరే కాని.. మెగా హీరోతో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు..ఆ స్క్రిప్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది..!

GRK

స్వయం ఉపాదికి అద్భుతమైన మార్గాలు ఇవే!

Teja

నాని 25వ చిత్రం`వి` రిలీజ్ డేట్‌

Siva Prasad