Categories: న్యూస్

పవర్ గ్రిడ్ ఈడీ సహా ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ

Share

అవినీతి ఆరోపణల నేపథ్యంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) బీఎస్ ఝా సహా ఆరుగురిని సీబీఐ అరెస్టు చేసింది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుండి లంచం తీసుకుని అనుకూలంగా వ్యవహరించాన్న అభియోగం నేపథ్యంలో ఈడీ ఝాను గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశ్ రాజ్ పాఠక్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ సింగ్ సహా మరో ముగ్గురిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

 

గాజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఢిల్లీ సహా మరి కొన్ని ప్రాంతాల్లో నిన్న సీబీఐ సోదాలు జరిపింది. గురుగ్రామ్ లోని ఝాకు చెందిన కార్యాలయంలో రూ.93 లక్షల నగదును సీబీఐ బృందం స్వాధీనం చేసుకుంది. ఝా ప్రస్తుతం ఈటా నగర్ లో విధులు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకుని టాటా ప్రాజెక్టుకు ఝా ప్రయోజనం చేకూర్చారని సీబీఐకి సమాచారం అందడంతో ఆయనపై నిఘా పెట్టి ముడుపులు చెల్లించే రహస్య ప్రదేశంలో బుధవారం దాడులు చేపట్టి నిందితులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నేడు పంచకులా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

 


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

47 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

56 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago