ముంబాయి, జనవరి 24: ఐసిఐసిఐ-విడియోకాన్ రుణం కేసుకు సంబంధించి సిబిఐ, బ్యాంకు మాజీ సిఇవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, విడియోకాన్ సంస్థ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ముంబయి, ఔరంగాబాద్‌లలోని విడియోకాన్ కార్యాలయాలపై గురువారం దాడులు నిర్వహించింది.
చందా కొచ్చర్ బ్యాకు సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవినుండి గత ఏడాది అక్టోబర్‌లో వైదొలిగారు. 2012లో వీడియోకాన్ సంస్ధకు 3,250 కోట్ల మేర రుణం ఇప్పించడంలో దీపక్, ఆమె కుటుంబసభ్యులు తెర వెనుక పాత్ర వహించారన్నది ప్రధాన అభియోగం.
తీసుకున్న రుణాన్ని దీపక్‌కు సంబంధించిన న్యూ పవర్ కంపెనీలో వేణుగోపాల్ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.
నిందితులిద్దరూ అనేక సంస్ధలను నడుపుతున్నట్లుగా అధికారుల ప్రాధమిక దర్యాప్తుల్లో వెల్లడైంది.
ఆదాయపన్నుశాఖ చందా కొచ్చర్‌కు 2018 ఏప్రిల్ రెండున న్యూ పవర్ కంపెనికి సంబంధించిన నిధుల సమీకరణపై