హర్యానా మాజీ సీఎం హుదా పై చార్జిషీట్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పై సీపీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు భూముల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ ఓరాతో సహా పలువురికి భూములు కేటాయించారు. హర్యానాలో సెక్టార్ 6లోని పంచకులలో సీ17 ఇండస్ట్రియల్ పార్క్ లోని ప్లాట్ ను ఏజేఎల్ కు కేటాయించారు. 2005లో ముఖ్యమంత్రిగా ఉన్న భూపిందర్ సింగ్ హుదా హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో 3,500 చదరపు మీటర్ల ప్లాట్ ను ఏజేఎల్ కు కేటాయించారు.