NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా హత్య కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ ..! ఈ నలుగురే నిందితులు..!!

Viveka Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన చార్జీషీటులో పలు కీలక అంశాలను పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై అభియోగపత్రం దాఖలు చేసింది. మొత్తం 650 పేజీల చార్జిషీట్ ను కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేశారు. దాదాపు 250 మందిని విచారించగా టి గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి, షేక్ దస్తగిరి నిందితులుగా తేలిందన్నారు.

 

Viveka Murder Case:  సూత్రదారులపై స్పష్టత రావాలి

ఇంకా మరి కొందరి పాత్రపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. నలుగురు  నిందితులను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అరెస్టు చేశామనీ,  వీరిలో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని  పేర్కొన్నారు.  ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో ఉన్నారని వివరించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ ను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో నిన్న సీబీఐ అధికారులు ప్రాధమిక చార్జి షీటు దాఖలు చేసిన సీబీఐ అధికారులు నేడు పూర్తి స్థాయి చార్జి షీటును దాఖలు చేశారు. మరో వైపు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత..సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు ను తమకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

తొలుత సిట్ దర్యాప్తు

ఇదిలా ఉండగా… 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి నెలలో కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో గాయపర్చడంతో ఆయన మృతి చెందారు. తొలుత వివేకా గుండెపోటుతో మృతి చెందాడని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆయన శరీరంపై గొడ్డలితో నరికిన గాయాలు ఉండటంతో హత్యగా తేల్చారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జగన్ సర్కార్ టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ ను తొలగించి కొత్త అధికారులతో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తును కొనసాగించింది.

250 మందిని విచారించి నలుగురిపై నేరం నిర్ధారణ

అయితే సిట్ దర్యాప్తు పై తమకు నమ్మకం లేదనీ సీబీఐ దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ కేసును సీరియస్ గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. వివేకా ఇంట్లో పని వాళ్లు, సన్నిహితులు, బంధువులు, డ్రైవర్లు, ఇలా 250మందికిపైగా అనుమానితులు, సాక్షులను విచారించి చివరకు ఎర్రం గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి ల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju