న్యూస్

CBI: నిబంధనలు పాటించని ఎన్‌జీవోలపై సీబీఐ కొరఢా..20 మంది అరెస్టు .. గుంటూరు జడ్‌పీ చైర్‌పర్సన్‌ భర్తపైనా కేసు నమోదు

Share

CBI: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు పాటించకుండా స్వచ్చంద సంస్థల (ఎన్‌జివో)ను కొనసాగించేందుకు అక్రమ మార్గాల్లో అనుమతులు పొందుతున్న వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దృష్టి పెట్టింది. ఈ ఎన్‌జివోలకు సహకరించిన అధికారులపైనా కొరఢా ఝులిపించింది. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేపట్టింది. బుధవారం 14 మంది నిర్వహకులు, దళారులతో పాటు ఎఫ్‌సీఆర్ఏ కార్యాలయ అధికారులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.3కోట్ల 21 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

CBI focused on Fraud ngos
CBI focused on Fraud ngos

CBI: దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు

36 మంది నిందితులతో పాటు ఏడుగురు అధికారులపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు బుధవారం దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించింది. నిందితుల్లో హార్వెస్ట్ ఇండియా సొసైటి అధ్యక్షుడుగా ఉన్న  గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ క్రిస్టినా భర్త కత్తెర సురేష్, సికింద్రాబాద్ కు చెందిన మనోజ్ కుమార్ తదితరులు ఉన్నారు. కత్తెర సురేష్ పై ఎఫ్‌సిఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందడంతో పాటు పిల్లల దత్తత, విదేశాలకు తరలింపుపై కేసు నమోదు చేశారు.


Share

Related posts

Daily Horoscope జూన్‌ 30 మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

Fruit Combinations: ఫ్రూట్స్ ని ఎలా తింటున్నారా..!? ఐతే డేంజరే..!!

bharani jella

Today Horoscope జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar