CBI in West Bengal: సీబీఐ ఏం చేయబోతుందో..!? బెంగాల్ లో కీలక పరిణామాలు – మమత ఇక మాజీ..!?

CBI in West Bengal: Big Task by BJP
Share

CBI in West Bengal: బీజేపీ కన్ను పడి.. అమిత్ షా, మోడీ ద్వయం లక్ష్యంగా పట్టుకుని ఛేదించలేని, సాధించలేని టార్గెట్ ఏమైనా ఉందీ అంటే అది పశ్చిమ బెంగాల్ మాత్రమే.. బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మమతా బెనర్జీ చేతి నుండి ఆ రాష్ట్ర పాలనని దక్కించుకోవాలనుకున్న బీజేపీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయినా బీజేపీ ఆగట్లేదు. ముందు దారిన చూసారు పని జరగలేదు, అందుకే ఇప్పుడు వెనుక దారిన ప్రయత్నాలు మొదలు పెట్టారు

. ఆ రాష్ట్ర పాలనని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి తప్పించడం కష్టమే అయినా.. సీఎం గా మమతా బెనర్జీని దింపేయడం బీజేపీకి ఇప్పుడు సులువైన పనిగానే మారింది. అందుకే ఆ దిశగా పావులు కదుపుతుంది. ముందుగా మమతా బెనర్జీని సీఎం కుర్చీ నుండి దించితే.., తృణమూల్ శ్రేణుల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తే.. ఆపై ఎమ్మెల్యేల పని పట్టొచ్చు అనే ఒక పథకం, పన్నాగం ప్రకారం బీజేపీ కొన్ని వ్యవస్థలను పశ్చిమ బెంగాళ్ పైకి ఉసిగొల్పినట్టు తెలుస్తుంది..!

CBI in West Bengal: Big Task by BJP
CBI in West Bengal: Big Task by BJP

CBI in West Bengal: ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టేనా..!?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సీఎం అభ్యర్థి మమతా బెనర్జి ఓడిపోయినా సంగతి తెలిసిందే. అందుకే ఆమె ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీ గా ఎన్నిక కాకపోతే సీఎం గా కొనసాగలేరు. ఆమెకు నవంబర్ 5 వరకు మాత్రమే గడువుంది. ఈ లోగా అంటే కనీసం అక్టోబర్ చివరి వారం లోగా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కమీషన్ లో ఆ కదలిక ఏమి కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ లో మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పట్లోనే రెండు స్థానాల్లో (జంగిపూర్, శంషేర్గంజ్) అభ్యర్థులు మరణించిన కారణంగా ఎన్నికలు జరగలేదు. తాజాగా మరో అయిదు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ 7 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకే ఈసీ ఆలోచనలు చేస్తుంది. కరోనా మూడో దశ హెచ్చరికలు, దుర్గా పూజ హడావిడి నేపథ్యంలో అక్టోబర్ లోగా ఈ ఎన్నికలు జరుగుతాయా..!? లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరగని పక్షంలో ఆమె మాజీ సీఎం అయినట్టే. పశ్చిమ బెంగాళ్ లో శాసనమండలి లేని కారణంగా ఆమె ఎమ్మెల్సీగా అవ్వడం కూడా కుదరని పని.. అందుకే ఉప ఎన్నికలు జాప్యమయ్యేలా చూసి మమతని దించాలని బీజేపీ మొదటి ఎత్తుగడ..!

CBI in West Bengal: Big Task by BJP
CBI in West Bengal: Big Task by BJP

సీబీఐకి పెద్ద టాస్క్..!? ఏం చేయబోతున్నారో..!? 

మరో వైపు మమతా.. ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరు ఇప్పటికే సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. నారదా చిట్స్ కుంభకోణం కేసులో మమత పార్టీకి సీబీఐ చుక్కలు చూపిస్తుంది. కొన్ని నెలలుగా విచారణ పేరిట ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇది కాకుండా తాజాగా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో తృణమూల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బెంగాల్ లో జరిగిన రాజకీయ హత్యలపై సీబీఐ విచారణ వేసేందుకు కేంద్ర హోమ్ శాఖ కసరత్తులు చేస్తుంది. దీనికై ప్రాధమిక సమాచారం సేకరణ.., ప్రాధమిక ఆధారాల సేకరణకు ఇప్పటికీ కొందరు నెరపరిశోధన నిపుణులు బెంగాల్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. వచ్చే వారమే బెంగాల్ విషయంలో కేంద్ర హోమ్ శాఖ ఒక నిర్ణయం తీసుకుని.., తృణమూల్ లోని కొందరు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తృణమూల్ వర్గాల్లోనే అంతర్గత చర్చ మొదలయింది. ఒకవైపు మమతా బెనర్జీని మాజీ చేయడం.., మరోవైపు తృణమూల్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం.., శ్రేణులను చెల్లాచెదురు చేయడం బీజేపీ టాస్క్ గా బెంగాల్ లో రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.. దేశంలోనే అతి పెద్ద ప్రాంతీయ పార్టీని నడిపించి.., భారీ గెలుపుని చూపించి.., మోడీ, అమిత్ షా ద్వయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న మమతా ఈ సీబీఐకి చిక్కులను ఎంత మేరకు ఎదుర్కోగలరు అనేది పెద్ద ప్రశ్న..!!

 


Share

Related posts

చైతన్య పక్కన మెరిసిపోతున్న నిహారిక.. వినూత్న సెల్ఫీ!

Naina

‘బిజెపి తిట్లు నాకు బహుమతే’!

Siva Prasad

RRR: “RRR” బ్యూటీ కి కరోనా పాజిటివ్..!! 

sekhar