NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

యరపతినేని ఇరుక్కు పోయినట్లేనా? సీబీఐ దాడుల్లో కీలక ఆధారాలు

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

 

గుంటూరు జిల్లా గురజాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో సీబీఐకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో యరపతినేని తో పాటు మరో 17 మంది నిందితులుగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వ హయాంలో ఎరపతినేని తో పాటు మరికొందరు టీడీపీ కి సంబంధించిన నేతలు పల్నాడు ప్రాంతంలో సున్నపురాయి, గ్రానైట్ వంటి విలువైన ఖనిజాలను ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారం మైనింగ్ చేశారని, కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఇప్పటికే సిఐడి విచారణ చేసి దానిపై పూర్తి ఆధారాలను కోర్టుకు నివేదించింది. 2016లో హై కోర్టు లో వేసిన పిల్ ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. కోర్టు విచారణ సమయంలో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని తేలడంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ఇప్పుడు వేగవంతం చేసింది. గత రెండు రోజులుగా ఎరపతినేని నివాసంతో పాటు ఇతరుల ఇళ్లలోనూ, బంధువుల ఇళ్లలోనూ, ఇతర 16 చోట్ల సిబిఐ ముమ్మర దాడులు చేపట్టింది. ఈ సమయంలో విలువైన హార్డ్ డిస్కులు, పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారాలు హైదరాబాదులోని నివాసంలో లభించినట్లు తెలుస్తుంది. దీనితో ఎప్పుడు యరపతినేని ఈ త్వరలో సి.బి.ఐ అరెస్ట్ చేస్తోంది అని ప్రచారం జోరు అందుకుంది.

 

CBI raids ex MLA Yarapathineni Srinivasa Rao properties in illegal mining case

శాటిలైట్ సాయంతో!!

అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసు కావడంతో సీబీఐ ఈ కేసులో శాటిలైట్ చిత్రాల సాయం తీసుకోవాలని చూస్తోంది. గూగుల్ మ్యాప్ లను పరిశీలిస్తోంది. మైనింగ్ ముందు ఎలా ఉండేవో తర్వాత పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి అంచనా వేసి కోర్టుకు నివేదించనుంది. పిడుగురాళ్ళ మండలం కేసనపల్లి కోనంకి గ్రామాల్లో అధికభాగం సున్నపురాయి నెలలను అక్రమంగా ఎరపతినేని పడుకున్నట్లు సిఐడి నివేదిక చెబుతుంది. ఈ గ్రామాలను సైతం సీబీఐ అధికారులు పరిశీలించనున్నారు. స్వయంగా వెళ్లి చిత్రాలు వీడియోలు తీసి అక్కడి గ్రామస్తులు కూడా కలిసి వివరాలు సేకరించనున్నారు. శాటిలైట్ చిత్రాల కోసం ఇప్పటికే ఇస్రో ను సీబీఐ సహకారం అభ్యర్ధన పంపింది. సీబీఐ కు దొరికిన ఆధారాలు తో పాటు గతంలో సిఐడి దర్యాప్తు లో వెలుగుచూసిన అంశాలను సైతం కేసులో కోర్టుకు నివేదించనున్నారు. కేసులో సాంకేతిక సాయం తీసుకుని ముందుకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి కొందరు ఐటి నిపుణులను సీబీఐ తన బృందంలో తీసుకుంది. మరో రెండు మూడు రోజులు నిందితుల ఇళ్లలో వారి బంధువులు లలో సైతం సిబిఐ దాడులు కొనసాగుతాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే యరపతినేని అక్రమ మైనింగ్కు అప్పటి ప్రభుత్వ సహకారం ఉందని, దీనిద్వారా ఆయన టీడీపీ కు భారీ లబ్ధి చేకూర్చారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సీబీఐ కేవలం మైనింగ్ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఛార్జిషీట్ వేసే అవకాశం ఉందని, అక్కడివరకే కేసు వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

అరెస్ట్ ఉంటుందా?

అతి తక్కువ భాగానికి మైనింగ్ లీజు తీసుకొని గ్రామాలకు గ్రామాలు ఎరపతినేని తో పాటు అతని అనుచరులు టిడిపి నేతలు తవ్వుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి అప్పటి మైనింగ్ అధికారులు సైతం వారికి సహకరించారు అనేది సిఐడి నిర్ధారించింది. అయితే ఇలాంటి కేసుల్లో సాధారణంగా సి.బి.ఐ అరెస్టులు చాలా తక్కువ. కేసు దర్యాప్తు తర్వాత ఛార్జిషీటు వేయడంతో పాటు స్థానిక పోలీసుల సాయంత్రం మాత్రమే కీలకమైన కేసులో సీబీఐ అరెస్టులు ఉంటాయి. నిందితుడు కచ్చితంగా సాక్ష్యాలను ప్రభావితం చేసేలా, నేర స్వభావం కలిగిన వాడై ఉంటే కనుక సిబిఐ అరెస్టు చేస్తుంది. లేకుంటే విచారణలో వెలుగు చూసిన అంశాలను నిజాలను కోర్టుకు నివేదించి కేసు విచారణను మొదలుపెడుతుంది. ఎరపతినేని కేసులో సీబీఐ ఎలా ముందుకు వెళుతుంది?? స్థానిక పోలీసుల సాయంతో ఆయనను అరెస్టు చేస్తారా లేక కోర్టులో విచారణ సమయంలోనే అసలు విషయాలను బయటపెడుతుంది అనేది వేచి చూడాలి

author avatar
Special Bureau

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju