Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కేసులో సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, సీబీఐని పూర్తిగా బీజేపీనే నియంత్రిస్తుందని ఆరోపించారు. తొలుత కేజ్రీవాల్ రాజ్ ఘాట్ కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అరవింద్ కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి దాచిపెట్టేందుకు ఏమీ లేదని అన్నారు. తన అరెస్టునకు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు. విచారణకు హజరైయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరో పక్క కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నించనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ నిరసనలకు పిలుపునిచ్చింది.
దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కేజ్రీవాల్ కు మద్దతుగా అప్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని కశ్మీరీ గేటు వద్ద ఆందోళనకు దిగిన కొందరు అప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ ఇప్పటికే పలువురు ప్రముఖులు, నేతలను అరెస్టు చేసింది. పలువురు ముఖ్యులను విచారణ చేసింది. తాజాగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారణ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ సిట్.. వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు