NewsOrbit
న్యూస్

దేశ రాజధానిలో సంచలనం..! రూ. 1800 కోట్ల కేసుపై సీబీఐ దర్యాప్తు..!!

 

దేశ రాజధానిలో సంచలనం. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్‌బీఐ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంలో 1,800 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో పెద్ద ఏత్తున ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు శుక్రవారం ఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు.

SBI bank

జయ్ పాలీకెమ్(ఇండియా) లిమిటెడ్‌పై బ్యాంక్ ఫ్రాడ్ కింద కేసు నమోదు చేశారు. లజపత్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న రుణగ్రహీత కంపెనీ, దాని ప్రమోటర్స్, డైరెక్టర్స్ ఎస్‌బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్టియంకు 1,800.72 కోట్ల నష్టం చేకూర్చారని, ఈ స్కాంకు సంబంధించి లజపతినగర్ లోని కంపెనీ డైరెక్టర్, గ్యారంటీర్ , మరికొందరిపై ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎస్‌బీఐను రూ.1,800 కోట్ల మేర రుణాలు తీసుకొని వాటిని దారి మళ్లించారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో మోసగించిన కంపెనీతోపాటు డైరెక్టర్ల ఇళ్లపై సీబీఐ దాడులు జరిపింది. వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

ఎర్నస్ట్ అండ్ యంగ్ నిర్వహించిన ఫొరెన్సిక్ అడిట్‌లో రుణగ్రహీత సంస్థ బ్యాంక్ లావాదేవీలు సరిగా లేవని తేలింది. కల్పిత లావాదేవీల, ఫోర్జరీ, నిధులను దారి మళ్లీంచడం చేసినట్టుగా కూడా తేలడంతో అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. రుణగ్రహీత కంపెనీతో పాటు, దాని మేనేజింగ్ డైరెక్టర్ సతీందర్ సింగ్ ధింగ్రా, డైరెక్టర్ సందీప్ సింగ్ మాధోక్, మరో కంపెనీ జాస్పార్క్ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసున్నారు. ఇక, సోదాలపై సీబీఐ స్పోక్స్‌పర్సన్ ఆర్‌కే గౌర్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని మూడు చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపారు. రుణగ్రహీత సంస్థ కార్యాలయంలో, నిందితుల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయని వెల్లడించారు. ఈ కేసు సంబంధించి మరిన్ని ఆధారాలను రాబడుతున్నట్లు సమాచారం.

 

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N