NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

బ్యాలట్ పద్ధతికి ఇసి ససేమిరా!

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ వైరాల కారణంగా ఇవిఎంలతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌తో సహా దేశంలోని దాదాపు 20 రాజకీయపక్షాలు ఇవిఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సైబర్ నిపుణుడిగా చెప్పుకుంటున్న సయ్యద్ షుజా అనే వ్యక్తి లండన్‌లో మీడియా సమావేశం నిర్వహించి, 2014 ఎన్నికలలో ఇవిఎంలను బిజెపి తరపున హాకింగ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రకటన దరిమిలా బ్యాలెట్ పత్రాల పద్ధతికి తిరిగి వెళ్లాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే షుజా చెప్పిన సంగతులలో దేనికీ ఆధారాలు దొరకడం లేదు. ఆయన తన కథనంలో పేర్కొన్న వ్యక్తులు అందరూ అలాంటి వ్యక్తి తమకు తెలియనే తెలియదని అంటున్నారు.

గురువారం సునీల్ అరోరా ఒక సమావేశంలో మాట్లాడుతూ, బ్యాలట్ పేపర్ల పద్ధతికి తిరిగి వెళ్లే సమస్యే లేదని అందరికీ స్పష్టంగా చెబుతున్నా అన్నారు. బ్యాలట్ పత్రాలను దౌర్జన్యకారులు ఎత్తుకువెళ్లే రోజులు మళ్లీ తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ‘ఎలాంటి విమర్శనయినా, సూచనలనయినా వినేందుకు మేము సిద్ధం. బెదిరిస్తే మాత్రం లొంగేది లేదు’ అని సునీల్ అరోరా వ్యాఖ్యానించారు.

 

author avatar
Siva Prasad

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

Leave a Comment