GHMC ఎన్నికల ఓట్లను వినియోగించుకోవడానికి మేము సైతం అంటున్న ప్రముఖులు

GHMCఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయినా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉదయం 9 గంటల వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 4.2 గా నమోదయ్యింది. మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది.

GHMC ఎన్నికల ఓట్లను వినియోగించుకోవడానికి మేము సైతం ప్రముఖులు

పోలింగ్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే చాలా మంది ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి, కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వియోగించుకున్నారు. అక్కినేని నాగార్జున మరియు అక్కినేని అమల తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ దంపతులు ఓటు వేశారు., నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కూడా ఓటు వేశారు.