హైదరాబాద్ ప్రళయ వర్షాల బాధితులకు ప్రముఖుల సాయం, వాటి వివరాలు….

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. మహా నగరమైన హైదరాబాద్లో ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించింది. ఇక బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికి చర్యలను మొదలుపెట్టింది.

 

వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సహాయార్థం గా తక్షణమే 500 కోట్ల రూపాయల రిలీఫ్ ఫండ్ ను కేటీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున 50 లక్షల రూపాయలను రిలీఫ్ ఫండ్ కు జతపరిచారు.

హైదరాబాద్ ప్రజలకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని తాను ఆశిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. ఇక హైదరాబాద్లో పరిస్థితి చక్కబడెందుకు మరి కొన్ని వారాలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలాగే నాగార్జున తో పాటుగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమకు చేతనయినంత సహాయాన్ని హైదరాబాద్ వరదల రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు అందజేయగా…. యువ హీరో విజయ్ దేవరకొండ 10 లక్షలు, నందమూరి బాలకృష్ణ 50 లక్షలు డొనేట్ చేశారు. సూపర్స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు, మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు డొనేట్ చేయడం జరిగింది.

ఇక మైహోం రామేశ్వర రావు ఐదు కోట్ల డొనేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు కోట్ల రూపాయలను తమ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు.