జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రెడీ!

పార్లమెంటు ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిగ్గా నెల రోజుల కిందట జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. సరిగ్గా పది హేను రోజుల తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనిపై రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భద్రతా బలగాలను పంపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు నిర్వహించినా  కేంద్రం సిద్ధమేనని పేర్కొన్నారు.