పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!!

పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మేటర్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పెన్షన్ తీసుకునే వారికి ఉరాట కలిగించినట్లు సమాచారం. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు తాజాగా కేంద్రం గడువును పెంచడంతో… సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు ఇది వర్తించనుంది.

Rs 2,000 notes dominate counterfeit currency seizures | Deccan Heraldజీవన్ ప్రమాన్ పత్రాన్ని సమర్పించడానికి టైం ఇవ్వటంతో…నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ అందించాల్సి ఉండగా, గడువు పెంచడం తో ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్ వచ్చే ఏడాది సమర్పించవచ్చు అని తెలపటంతో పెన్షన్ తీసుకునే వారికి ఉరాట కలిగించినట్లు అయింది. ఈ నిర్ణయంతో పెన్షనర్లు వారి పెన్షన్ సర్టిఫికెట్ ప్రస్తుతం ఇవ్వకపోయినా కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు నిరంతరాయంగా పెన్షన్ పొందవచ్చు.

 

ప్రభుత్వం ఇలా గడువు పెంచడం ఇది రెండోసారి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నవంబరు 1 నుంచి డిసెంబర్ 31కి గడువు పెంచగా ఇప్పుడు ఈ డెడ్ లైన్ మరొక రెండు నెలలు పెంచడం గమనార్హం. కారణం చూస్తే కరోనా వైరస్ వలన ప్రతికూల పరిస్థితుల వాతావరణం బయట ఉండటంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లైఫ్ సర్టిఫికెట్ వచ్చినవారు ఆన్లైన్లో సమర్పించ వచ్చు అని తెలిపింది.