NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Central Cabinet: ఏపీకి పెద్ద హ్యాండ్ ఇవ్వబోతున్న మోడీ..!

Central Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనబడుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం లభిస్తుంది..మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఎట్టకేలక ముహూర్తం ఖరారు అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జూలై మొదటి వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందని వార్తలు వస్తున్నాయి. జూలై రెండు మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. యూపీ పర్యటన ముగించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు ఢిల్లీ చేరుకోనున్నారు. నేడో రేపో కేబినెట్ విస్తరణకు సంబంధించి సమాచారం పిఎంఓ అందించనున్నది.

Central Cabinet no chance to ap leaders
Central Cabinet no chance to ap leaders

Read More: Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతి ఫిక్స్..! వారంలోనే అరెస్టు..!?

Central Cabinet: మంత్రివర్గ విస్తరణపై పూర్తయిన కసరత్తు

ఇప్పటికే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పూర్తి చేసినట్లు సమాచారం. కొత్తగా 20 మందికిపైగా నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో మంత్రివర్గం ఏర్పాటు తరువాత మొదటి సారి కేబినెట్ విస్తరణ జరగనున్నది. ఇటీవల కాలంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న రాంవిలాస్ పాశ్వన్, సురేశ్ అంగడి మరణించడం, అనేక మంది మంత్రులు ప్రస్తుతం ఒకటికి మించి శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు పూనుకుంటున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణలో ప్రధానంగా యూపీ, గుజరాజ్, లద్ధాక్, హర్యానా, కర్నాటక, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఏపికి నో ఛాన్స్

2018లో ఎన్‌డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చేసిన తరువాత కేంద్ర మంత్రులుగా ఎవరూ లేరు. ఏపి నుండి బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఉత్తర ప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవిఎల్ నర్శింహరావులు ఉన్నప్పటికీ వీరికి ఎవరికి చాన్స్ లేదని వార్తలు వస్తున్నాయి. వీరిలో జీవిఎల్ మినహా మిగిలిన ముగ్గురు టీడీపీ నుండి బీజేపీలోకి విలీనమైనవారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంద్రీశ్వరి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఎంపిగా లేరు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వినిపించినప్పిటకీ అదంతా పుకారేనని తేలిపోయింది. ఈ సారి ఏపి నేతలకు అవకాశం ఇవ్వకపోతే వచ్చే మూడేళ్ల వరకూ ఎవరూ కేంద్ర మంత్రులుగా లేనట్లే.

author avatar
Srinivas Manem

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju