ట్రెండింగ్ న్యూస్

నీట్ పరీక్షల గురించి కేంద్రమంత్రి ఏమన్నారంటే …?

Share

 

 

కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు విద్య రంగాన్ని కూడా ఎంతో దెబ్బ తీసింది. ఈ విద్యా సంవత్సరం అంత విద్యార్థులని, వారి తల్లి తండ్రులని గందరగోళంలో పడేసింది. ఇక పరీక్షల విషయానికొస్తే ఎన్నో అనుమానాలు.. వీటన్నిటికీ సమాధానంగా విద్యారంగంలో నెలకొన్న సందేహాలకు సమాధానం చెప్పారు కేంద్ర విద్య శాఖ మంత్రి,పొక్రియాల్ నిషాంక్.

central education minister

జేఈఈ,నీట్ విద్యార్థులతో ఈ రోజు పొద్దున్న10 గంటలకు ఆన్ లైన్ చర్చావేదిక లో కేంద్ర విద్య శాఖ మంత్రి పాల్గొన్నారు. భారత్ దేశంలో మెడికల్ విద్యలో ప్రవేశాల కోసం ఎంతో ప్రతిష్టంకంగా నిర్వహించేధీ నీట్ ప్రవేశ పరీక్షా. ఈ పరీక్షకు సంబంధించి కొత్త విషయాన్ని తెలిపారు. నీట్-2021 పరీక్షను రద్దు చేయాలని కొంతమంది కోరగా, అలాంటి ఆలోచనేది తమకు లేదని కేంద్ర విద్య శాఖ మంత్రి స్పష్టం చేసారు. అయితే ఇప్పటివరకు ఆఫ్ లైన్ పద్ధతిలో నిర్వహించిన పరీక్షను డిజిటల్ మోడ్ లో నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీనికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐఐటి లలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలను ప్రస్తుతం 2 సార్లు నిర్వహిస్తున్నాం, అయితే ఏడాది కాలంలో నాలుగుసార్లు నిర్వహించేలా సాధ్యాసాధనలపైనా పరిశీలిస్తున్నం అన్నారు. అలాగే సిలబస్ తగ్గింపు, ప్రాక్టీకల్స్ కు ప్రత్యామ్యాయం ఆలోచిస్తామని తెలిపారు. అయితే జేఈఈ -2021 పరీక్షా జనవరి కి బదులు ఫిబ్రవరి చివరి వారంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ లో జరగాల్సిన రెండో విడత పరీక్షా సెప్టెంబర్ కి మార్చినట్లు తెలిపారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూపొందించిన నేషనల్ టెస్ట్ అభ్యాస యాప్ నీట్-2020 ,జేఈఈ మెయిన్స్-2020 విద్యార్ధులకి లాక్ డౌన్ సమయంలో బాగా ఉపయోగపడిందని తెలిపారు.


Share

Related posts

రామ్ రెడ్ సినిమా మీద ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరి పరిస్థితి ఇక అయోమయమేనా ..?

GRK

Prabhas: రాధే శ్యామ్, సలార్ రీ షూట్..కంగారు పడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

GRK

Nandamuri Family: బాబాయ్ అబ్బాయ్ హీరోలుగా అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్..!?

bharani jella