NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం ..పరిశీలనకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీ

Share

Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన (బ్రిడ్జ్) కుంగిపోవడంపై ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు తీవ్ర స్థాయి ఆరోపణలు చేశాయి. ఘటనపై సిట్టింగ్ జడ్జి సహా సీవీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందని బీజేపీ విమర్శిస్తూ.. వరస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

మేడిగడ్డ ఘటనపై కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా స్పందించింది. మేడిగడ్డ  బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై నిపుణుల కమిటీని కేంద్ర జలశక్తి శాఖ వేసింది. నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్షించిన తర్వాత మేడిగడ్డ రిజర్వాయర్ ను కమిటీ సందర్శించనున్నది.

మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసిఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మించినప్పుడు డబ్బులు వృధాగా పోతాయని అప్పుడే చెప్పామనీ, ప్రస్తుతం నిజం అవుతుందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్ .. మేడిగడ్డ పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై క్షేత్ర స్థాయి సందర్శనకు రావాలని మంత్రులు హరీష్ రావు, కేటిఆర్ కు వారు సవాల్ విసిరారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మరో పక్క మేడిగడ్డ బ్యారెజీ అడుగున్నర మేర కుంగుబాటునకు డిజైన్ లో లోపం లేదని ప్రాజెక్టు ఈఎన్సీ చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

బ్యారేజీ రూపకల్పన పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల డిజైన్ మేరకే చేపట్టామని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొంది. ఇటీవల 2023 సీజన్ తో సహా గత అయిదు వరద సీజన్ల ను బ్యారేజీ తట్టుకుందని తెలిపింది. గత ఏడాది ఈ బ్యారేజీకి 28.251 క్యూసెక్కుల డిజైన్ డిశ్చార్జ్ ఉంటే .. అత్యధికంగా 28.70 లక్షల క్యూసెక్కుల వరద నమోదైందని చెప్పింది. జూలై 2022 లో సంభవించిన భారీ వరదల్లో కూడా బ్యారేజీ సురక్షితంగా తట్టుకుందని తెలిపింది. తాజాగా బ్యారేజ్ లోని బ్లాక్ 7 లోని ఒక ప్రదేశంలో పెద్ద శబ్దం వచ్చి వంతెన భాగం కుందిపోయిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్ర అధికారులతో తమ సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించిందన్నారు. నష్టాలను సాంకేతికంగా అంచనా వేసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా నష్టాన్ని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఎల్ అండ్ టీ ప్రకటన విడుదల చేసింది.

AP E challan scam: ఆ రిటైర్డ్ డీజీపీ అల్లుడు మామూలోడు కాదుగా..ఏకంగా రూ.36.53 కోట్లు కొట్టేశాడు


Share

Related posts

కరోనా పై పోరు కు తనవంతు సాయంగా 1.25 కోట్లు సాయం చేసిన బాలకృష్ణ

Siva Prasad

Pain Killer: నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కోసం ఇవి ట్రై చేశారా..!?

bharani jella

YS Jagan: మీ జయంతి మాకందరికీ పండుగ

somaraju sharma