NewsOrbit
న్యూస్

చంద్రబాబు నెత్తిన పాలుపోసిన కేంద్ర ప్రభుత్వం !

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా క్యాబినెట్ ఏర్పాటు చేసి జరిగిన అవినీతిపై ఒక నివేదిక కూడా తేప్పించు కోవడం జరిగింది. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు లో చంద్రబాబు భయంకరంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన హయాంలో ప్రభుత్వం ఎవరికైతే కాంట్రాక్టులు కట్టబెట్టిందో వాటిని రివర్స్ టెండరింగ్ ద్వారా చెక్ పెట్టి మరొకరికి జగన్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి వెలికి తీయాలి ప్రత్యేకంగా మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది.

 

16th March 2017 Current Affairs Analysis - IASTopperst | IASToppersఅది విచారణ జరిపి అవినీతి జరిగినట్టు నిర్ధారించింది. ఇదే విషయాన్ని ఏపీ సర్కారు కేంద్రానికి నివేదించింది. ఆ తర్వాత ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. ఇలాంటి తరుణంలో పోలవరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని, ఆ తర్వాతే నిధులు విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కార్ ప్రస్తుతం ఇరకాటంలో పడింది. మరోపక్క పెంటపాటి పుల్లారావు అనే పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించి పోలవరం అవినీతి విషయంలో విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని తోసిపుచ్చిన హైకోర్టు దాన్ని ఫిర్యాదుగా జలశక్తి శాఖకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా జలశక్తి శాఖ పుల్లారావు లిఖితపూర్వకంగా సమాధానం పంపించింది. పోలవరం ప్రాజెక్టు పై వస్తున్న అవినీతి ఆరోపణలు పై విచారణ చేయాలని ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని క్లారిటీ ఇచ్చింది.

 

అంతే కాకుండా అవినీతి జరిగింది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా ఈ లెటర్ లో కేంద్ర జల శాఖ పేర్కొన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని ఆ పిటిషనర్ కీ జలశక్తి శాఖ సమాధానం ఇచ్చిందట. దీంతో స్వయంగా కేంద్ర ప్రభుత్వ శాఖ ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని పిటిషన్ వేసిన పిటిషనర్ కి సమాధానం ఇవ్వడంతో చంద్రబాబు నెత్తిపై పాలు పోసినట్లు అయిందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు పై అనేక అవినీతి ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్న ఇలాంటి సమయంలో జలశక్తి శాఖ స్వయంగా నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగినట్లు చెప్పటం చంద్రబాబు కి ప్లస్ అని మేధావులు చెబుతున్నారు.  

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju