Applications Banned: అవును.. చైనా యాప్స్‌పై కేంద్రం మరోమారు విరుచుకుపడింది. దాదాపు 54 యాప్స్ త్వరలో బ్యాన్ కానున్నాయి. అయితే వీటిలో అత్యధిక శాతం చైనా యాప్స్ కావడం కొసమెరుపు. భారతదేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతకు వాటి వలన ముప్పు వాటిల్లే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్స్ పైన ఎంకౌంటర్ చేయబోతోంది. ఇక గతంలో గాని మనం చూసుకుంటే కేంద్రం పదుల సంఖ్యలో చైనా యాప్స్ ను నిషేదించిన సంగతి మనకు విదితమే. దాదాపు 300కి పైగా చైనా యాప్స్‌ను గతంలో కేంద్ర నిషేదించింది.
Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీ కోసం ఆ రెండూ కాదు మరో కొత్త రిలీజ్ డేట్..?
Applications Banned: క్రింద పేర్కొనబడిన యాప్స్ లిస్టులో వున్నాయి!
స్వీట్ సెల్ఫీ HD, బ్యూటీ కెమెరా సెల్ఫీ కెమెరా, వివ వీడియో ఎడిటర్, టెన్సెంట్ జిరివర్, ఆన్మైఓజి ఎరీనా, యాప్ లాక్, డ్యూయెల్ స్పేస్ లైట్ వంటి పలు రకాల యాప్స్ ఈ లిస్టులో ఉన్నట్లు తాజా నివేదికల ప్రకారం తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాతో సరిహద్దు గొడవల నేపథ్యంలో 2020 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 300 వరకు యాప్స్‌ను నిషేధించారని నివేదికలు చెబుతున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం దాదాపు 270 యాప్స్‌పై నిషేధం విధించింది. మళ్లీ ఇప్పుడు 54 రకాల యాప్స్‌ను బ్యాన్ చేయడం గమనార్హం.
Night Sweats: నిద్రలో చెమటలు పడుతున్నాయా.!? కచ్చితంగా అనుమానించాల్సిందే..!?
సెక్షన్ 69A:
తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం IT యాక్ట్‌లోని Section 69A కింద ఈ నిషేధం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రీ ఫైర్ యాప్ కూడా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో కనిపించచలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్స్‌లో ఇది చేరిపోయింది తెలుస్తోంది. ఇంకా పాపులర్ యాప్స్ అయినటువంటి యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, ఉయ్ చాట్, లైకీ, బ్యూటీ ప్లస్ వంటి వాటిపై కూడా నిషేధం ఉంది. ఇలా యాప్స్‌పై నిషేధం విధించడం వల్ల ఆ యాప్స్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం లేకపోలేదు.