Central Govt: పార్లమెంట్ సభ్యులకు మోడీ సర్కార్ షాక్ ..! మేటర్ ఏమిటంటే..?

Share

Central Govt: తన వ్యక్తిగత చరిష్మాతో కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి మోడీ పరిపాలనలో తన దైన ముద్ర చూపుతున్నారు. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండా బీజేపీకే 300లకు పైగా పార్లమెంట్ స్థానాలు రావడంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా తాను తీసుకున్న నిర్ణయాలలో మోడీ వెనుకడుగు వేయడం లేదు. అయితే కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజా ప్రతినిధులకు రుచించని పరిస్థితి ఏర్పడుతోంది. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రవేటీకరణ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా టాటా ల చేతికి వెళ్లిపోవడంతో ప్రవేటీకరణ మొదలైంది. ఈ ప్రక్రియ నేపథ్యంలో ఎంపిలకు ఓ చేదు వార్త అందించింది రాజ్యసభ సచివాలయం.

central govt cancelled mps free flight tickets
central govt cancelled mps free flight tickets

Read more: Kerala Minister: ఏపిలోని ఈ సిస్టమ్ సూపరే సూపర్ అంటూ కేరళ మంత్రి కితాబు…!!

 

Central Govt: ఎంపిలు విమాన టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సిందే..

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ నేపథ్యంలో ఇకపై ఎంపీలు ఎవరి విమాన టికెట్లు వారే కొనుగోలు చేసుకుని తరువాత రీయింబర్స్ మెంట్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని రాజ్యసభ సచివాలయం నిన్న స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బిల్లుల క్లియరెన్స్ కు చాలా సమయం పడుతుంది కాబట్టి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కొందరు ఎంపీలకు ఇబ్బందికరమే అని చెప్పాలి.


ఇప్పటి వరకూ ఉచితంగా విమాన టికెట్లు

ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కారణంగా పార్లమెంట్ సభ్యులకు వ్యక్తిగతంగా 34 టికెట్లు, వారి కుటుంబ సభ్యులకు మరో 8 టికెట్లు ఉచితంగా అందించే వారు. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటా ల పరం అవ్వడంతో ఉచిత విమాన టికెట్ల కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రకటన విడుదల చేసింది. టికెట్ల కొనుగోలుకు పార్లమెంట్ ఉభయ సభల సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ చేంజ్ ఆర్డర్ ను చూపించి టికెట్లు కొని ఉంటే కనుక టీఏ క్లైయిమ్ చేసుకోవాలని సూచించింది.

వరుసగా కోతలు

ఇప్పటికే పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ఎంపీ ల్యాడ్స్ నిధులను తాత్కాలికంగా స్తంభింపజేసింది. కరోనా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేయడం లేదు. దానికి తోడు కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపిలకు ఉన్న పది సీట్ల కోటాతో పాటు కేంద్ర మంత్రి మంజూరు చేసే అదనపు సీట్ల కోటాను కూడా కేంద్రం రద్దు చేసింది. ఇప్పుడు విమాన టికెట్ల వంతు వచ్చింది.

 


Share

Related posts

గుత్తాజ్వాల ఓటు లేదు

Siva Prasad

Dhivya dhuraisamy fabulous pics

Gallery Desk

Vakeel Saab: అయినా కానీ జోరు తగ్గని “వకీల్ సాబ్”..!! 

sekhar