NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

‘బీజేపీకి టీఆర్ఎస్ యే బంగారపు పళ్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగిస్తుంది’

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తీరే బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీ హెచ్ ఎం సీ) ఎన్నికల ప్రచారానికి నేడు నగరానికి వచ్చేసిన అమిత్ షా ముందుగా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా చార్మినార్ సమీపంలో గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వారాసిగూడ నుండి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్నారు.

అనంతరం షా.. కేసీఆర్ పాలన తీరును విమర్శించారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ స్థాయి నాయకులు ప్రచారానికి వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. ఇవి గల్లీ ఎన్నికలు అనేవారు ఆ గల్లీ లను ఎందుకు అభివృద్ధి చేయలేడని ప్రశ్నించారు. నేడు రోడ్డు షో కు హాజరైన ప్రజానీకాన్ని చూస్తేనే బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం అవుతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడాలని, ప్రపంచ ఐటీ హబ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

bjp-secret-survey-shocking-partyతెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై షా మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడి సచివాలయానికి వెలితే కేంద్రం హైదరాబాద్ కు ఎంత ఇచ్చిందో లెక్కలు తెలుస్తాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మినహా ఎవరికీ పరిపాలన అనుభవం లేదా అని షా ప్రశ్నించారు. రాజకీయాలలో ఎవరు ఎవరితో నైనా పొత్తు పెట్టుకోవడం తప్పులేదు కానీ ఎంఐఎంతో టీఆరెస్ రహస్య ఒప్పందం ఎందుకు చేసుకుందని షా ప్రశ్నించారు. ఈ కార్యక్రమాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర నేతలు పాల్గొన్నారు. షా పర్యటన సందర్బంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju