NewsOrbit
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇది

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపిలో 175 గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలో 119 గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుకోవచ్చని తెలిపింది. 2019 ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్రం.. విభజన చట్టంలోని హామీ మేరకు ఆమోదం తెలుపుతుందని భావించారు. అయితే కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

 

ఏపి, తెలంగాణ విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకూ పెంచలేదు. అసెంబ్లీ స్థానాల పెంచాలని రెండు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. అయితే అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై తాజాగా కేంద్రం పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చింది. బీజేపీ రాజ్యసభ  సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై అడిగిన ప్రశ్నకు ఇప్పట్లో అసెంబ్లీ స్థానాల పెంపు లేదన్నట్లుగా కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్  లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

 

అసెంబ్లీ నియోజకవర్గాల పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలియజేశారు మంత్రి నిత్యానంద రాయ్. ఇదే క్రమంలో నియోజకవర్గాల పెంపునకు 2026 జనగణన పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ సమాధానంతో … తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రక్రియ ప్రారంభం కావాలంటే 2026 వరకూ ఆగాల్సిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలతోనే జరుగుతాయి. 2026 లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ప్రారంభిస్తే .. తెలంగాణలో 2028, ఏపిలో 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju