NewsOrbit
న్యూస్

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

Poll Violence: ఏపీలో పోలింగ్ రోజున మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన ఇవేళ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం మాచర్ల ఘటనను దురదృష్టకరమైన ఘటనగా భావిస్తొందన్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు.

మాచర్ల ఘటనపై రెంటచింతల సబ్ ఇన్స్ పెక్టర్ కోర్టులో మెమో దాఖలు చేశారని, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఏ 1 గా పేర్కొంటూ కేసు నమోదు చేశారని తెలిపారు. 20వ తేదీన ఈ కేసు నమోదైందని, 21న వెలుగు చూసిన వీడియో నిజమైనదేనని, అది వైరల్ అయిన తర్వాత సీఈసీ స్పందించిందని చెప్పారు. పిన్నెల్లిని అరెస్టు చేయడానికి మంగళవారం నుండి తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అతని ఇంటి మీద కూడా దాడులు నిర్వహించామని, అతని ఆచూకి దొరకలేదన్నారు.

నిందితుడిపై పది సెక్షన్ ల కింద కేసులు పెట్టామని, నిందితుడికి ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందని మీనా చెప్పారు. ఎన్నికల సంఘం సీసీ కెమెరాలు పెట్టడం వల్లనే అధారాలు దొరికాయని, అవి లేకపోతే ఎలాంటి ఆధారాలు దొరికేవి కాదని మీనా చెప్పారు. ఎన్నికల సంఘం ఎవరినీ ఉపేక్షించదని అన్నారు. పోలింగ్ జరిగిన తర్వాత చాలా పరిణామాలు జరిగాయని, ఎస్పీ, డీఎస్పీలు బదిలీ అయ్యారని, సిట్ వచ్చిన తర్వాత దర్యాప్తు వేగంగా జరిగిందని, బదిలీల వల్ల రెండు మూడు రోజుల జాప్యం జరిగిందని సీఈవో మీనా తెలిపారు.

ఎన్నికల సంఘం పోలింగ్ కు సంబంధించిన ఏ ఘటనను దాచిపెట్టలేదన్నారు. ఎన్నికలు పూర్తైన వెంటనే ఆ వివరాలను పోలీసులకు అప్పగించామన్నారు. పిన్నెల్లి కోసం హైదరాబాద్ లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పిన్నెల్లి ఆచూకి లభిస్తుందని చెప్పారు. ఎన్నికల సంఘం సిట్ దర్యాప్తు మీద నేరుగా పర్యవేక్షిస్తొందన్నారు.

కాగా, తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారైనట్లు గుర్తించారు. ఏపీ, తెలంగాణ పోలీసులు పిన్నెల్లి సోదరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

 

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే(నా)..!

sharma somaraju