https://youtu.be/uDf1veN8G-E
పది నెలల క్రితం ప్రొఫెసర్ శ్రీవాత్సవ ఒక వివాహ వేడుకలో చేసిన డాన్స్
డాన్సింగ్ అంకుల్ గుర్తున్నాడా? అదే, గతం సంవంత్సరం మధ్యప్రదేశ్‌లో ఎక్కడో ఒక పెళ్లిలో డాన్స్ చేసి ఇంటర్నెట్ సంచలనం అయ్యాడు చూడండి, ఆ డాన్సింగ్ అంకుల్! ఇప్పుడా అంకుల్ సొంత మ్యూజిక్ వీడియో బయటకు వదిలాడు.
డాన్సింగ్ అంకుల్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ శ్రీవాత్సవ. ఆయన రిలీజ్ చేసిన వీడియో యుట్యూబ్లో సంచలనంగా మారుతోంది. ‘చాచా నాచ్’ అన్న పేరుతో దానిని రూపొందించారు. ప్రొడ్యూసర్, కంపోజర్ జాసిమ్, గాయకుడు బెన్నీ దయాళ్‌తో కలిసి ఈ వీడియో రూపొందించారు. ‘ప్రపంచంమంతటా ఉన్న అంకుల్స్ కలిసి కనిపెట్టిన డాన్స్ ఇది’ అని వీడియో గురించి రాశారు. మీరూ చూడండి డాన్సింగ్ అంకుల్ తాజా వీడియో.