NewsOrbit
న్యూస్

‘HCL’కు లేడీ బాస్ రోషిణి నాడార్.. సీఈవో నుంచి చైర్ పర్సన్ వరకూ..

chair person roshini leads hcl

భారత్ లోని ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటి హెచ్ సీఎల్ టెక్నాలజీస్. ప్రస్తుతం సంస్థలో కీలక మార్పులు జరిగాయి. సంస్థ చైర్మన్ శివ నాడార్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి ఆయన కుమార్తె రోషిణి నాడర్ మల్హోత్రా చైర్ పర్సన్ గా వచ్చారు. ఇప్పటివరకూ సంస్థ ఉన్నత స్థానంలో నిలవడానికి కృషి చేసారు శివ నాడార్ తన బాధ్యతను కుమార్తెకు అప్పగించారు.

chair person roshini leads hcl
chair person roshini leads hcl

 

ఇప్పటివరకూ ఆమె హెచ్ సీఎల్ కు సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శివ నాడార్ ఫౌండేషన్ కు ట్రస్టీగా కూడా వ్యవహరించారు. రోషిణి నాడార్ వయసు 38 ఏళ్లు. శివ నాడార్ కు ఆమె ఏకైక కుమార్తె. రోషిణి ఢిల్లీలో పెరిగారు. వసంత్ వ్యాలీ స్కూల్ లో చదువుకున్నారు. ఉన్నత విద్యను నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీలో కమ్యునికేషన్ విభాగంలో డిగ్రీ చదివారు. అమెరికాలోని కెలాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం సంస్థలో చేరి పలు హోదాల్లో పని చేశారు. 2013లో హెచ్ సీఎల్ టెక్నాలజీ బోర్డు అడిషనల్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.

పని చేసిన ప్రతి హోదాలో సంస్థను విజయవంతంగా నడిపారు. సంస్థను మంచి బ్రాండ్ గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. 2017 నుంచి 2019 మధ్య కాలంలో శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటివరకూ శివ నాడార్ సారధ్యంలో ఎదిగిన కంపెనీ ఇకపై రోషిణి ఆధ్వర్యంలో కొత్త హైట్స్ కి చేరుకుంటుందని ఆశిస్తున్నారు.

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju