మెగా డాటర్ పెళ్ళి కి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. పెళ్ళి పనులు అన్నీ చివరి దశకు చేరుకున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలస్ లో జరగనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా ఉదయపూర్ లో సంబరాలలో చేసుకుంటున్నారు. అక్కడి వాతావరణం చాలా సందడిగా ఉన్నదీ.
నిహారిక తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూనే ఉంది. మంగళ స్నానాలు, పెళ్లి కూతురిని చెయ్యడం, మెగా సిస్టర్స్ తో ఫోటోలు, ‘మా అమ్మ నిశ్చితార్ధం చీర ‘ అంటూ తను చేసిన పోస్ట్, చిరు తో సెల్ఫీ, చిరంజీవి మరియు సురేఖ ఆశీర్వదిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మెగా ఫాన్స్ ఆ ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతున్నారు. మా మెగా డాటర్ కుందనపు బొమ్మ అంటూ తెగ అభినందించేస్తున్నారు.
ఈ రోజు నాగబాబు ఫ్యామిలీ మరియు చైతన్య ఫామిలీ అంతా ఓ ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్ చేరారు. ఈ సందర్భంగా వెంకట చైతన్య ఫ్లైట్ లో తీసిన సెల్ఫీని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ఆసెల్ఫీ లో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చైతన్య కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో జొన్నలగడ్డ చైతన్య నిహారికను పెళ్లాడనున్నాడు. 9 వతేదీన వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా ఉదయపూర్ ప్యాలస్ లో జరగనున్నది. పెళ్ళికి హాజరు కాలేకపోతున్న వారికోసం మెగా ఫామిలీ హైదరాబాద్‌లో రిసెప్షన్ ను ఏర్పాటు చెయ్యనున్నది.