Bangaarraju: 2016లో వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి ప్రీక్వెల్ గా బంగార్రాజు రూపొందించబోతున్నట్టు ప్రకటించి 5 ఏళ్ళు కావచ్చింది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన కథ అందరికీ తెలిసిపోయింది కాబట్టి దీనికి ముందు జరిగిన కథ ఏంటో అని ..అది తెలుసుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. వాళ్ళ తాపత్రాయనికి తగ్గట్టుగానే సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకి ఇప్పుడు మొదలైంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ ప్రీక్వెల్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి నాగార్జునని మెప్పించడానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి ఇన్నేళ్ళు పట్టింది. తాజాగా అధికారకంగా ప్రారంభమైన బంగార్రాజు మరో వారం రోజుల్లో సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అక్కినేని నాగార్జునతో పాటు ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. నాగార్జునకి జంటగా సీనియర్
హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూకి జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో చైతూకి జంటగా సమంత నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
Bangaarraju: మరోసారి ఈ రొమాంటిక్ కపుల్‌ని చూడబోతున్నామని భావించారు.
దాంతో మరోసారి ఈ రొమాంటిక్ కపుల్‌ని చూడబోతున్నామని భావించారు. కానీ అభిమానులకి షాకిస్తూ నాగార్జున బృందం కృతి శెట్టిని ప్రకటించింది. దాంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారట. ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో సమంత – చైతూ ఎంతగా అలరించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ మాయ చేశావే, మనం, మజిలీ చిత్రాలు సమంత – చైతూల కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే మరోసారి వీరిని బంగార్రాజులో చూడాలని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులు మాకు సమంతనే చైతూకి జంటగా చూడాలని ఉందని ట్రోల్ చేస్తున్నారట.