Chalaki Chanti: జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కమెడియన్ చలాకీ చంటి. ఇతను దాదాపు 10 ఏళ్లుగా జబర్దస్త్ లో కమెడియన్‌గా చేశాడు. ఆపై చంటి బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ వెళ్లాడు. తన కామెడీతో టాప్ 5కి చేరుకుందాం అని ట్రై చేశాడు. కానీ ప్రేక్షకులు మాత్రం 5వ వారంలోనే బయటికి పంపించేశారు. ఇక ఒకసారి హౌజ్‌లో నుంచి బయటికి వస్తే మళ్లీ లోపలికి వెళ్లే అవకాశం ఎలాగో ఉండదనే ఈ యాంకర్ యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ కాలం గడిపేస్తున్నాడు.
Chalaki Chanti: ఆసక్తికర విషయాలు వెల్లడి
అసలు చంటి బీబీ హౌజ్ నుంచి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడనే విషయం ఎవరికీ అంతుపట్టలేదు. ఎందుకంటే చంటి కంటే వీక్ కంటెస్టెంట్లు హౌజ్‌లో చాలామంది ఉన్నారు. అయితే చంటి తన ఎలిమినేషన్ కీ గల కారణం ఏంటో నాకు తెలుసు, దానిగురించి సీజన్ అయిపోయాక చెప్తా అంటూ అందరిని ఆలోచనలో పడేశాడు. కాగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంటి జబర్దస్త్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఎందుకు మానేశాడు
అతడు మాట్లాడుతూ.. ‘గతంలో ఒకసారి నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాను, అలా అని వేరే ఏ ఛానెల్లో ఎలాంటి ప్రోగ్రామ్ చేయలేదు. జబర్దస్త్‌లో చేసిన స్కిట్ మళ్లీ మళ్లీ చేసి బోర్ కొట్టింది, అందుకే కొన్నాళ్లు జబర్దస్త్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. అప్పుడు జబర్దస్త్ వాళ్ళు షోకు రమ్మని పిలిచారు. అలానే వేరే ఛానెల్లో కూడా జబర్దస్త్ లాంటి షోనే ప్రారంభించారు. కానీ నాకు అక్కడికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. వాళ్లు కూడా నన్ను రమ్మని పిలవలేదు. ఒక ఆరు నెలలు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చాను. కానీ ఇప్పుడు పారితోషకం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల జబర్దస్త్ షో వదిలేయాల్సి వచ్చింద”ని చెప్పాడు. కాగా రెమ్యునరేషన్ గురించి జబర్దస్త్ షో వదిలేసాడని తెలిసి ప్రేక్షకులు అందరూ అవాక్కవుతున్నారు.