న్యూస్ సినిమా

చమక్ చంద్ర డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ చేస్తే అదే జరగనున్నదా?

చమక్ చంద్ర డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ చేస్తే అదే జరగనున్నదా?
Share

టాలెంటెడ్ నటులు ఈటీవీ ఛానల్ లోని జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బులితెర మీద మాత్రమే కాకుండా వెండి తెర మీద కూడా అవకాశాలు దక్కించుకుని రాణిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే చమ్మక్ చంద్ర. జబర్ధస్త్‌ షో లో తనదైన స్టయిల్లో తన కామెడీ మరియు టైమింగ్ తో అందరి అభిమానాన్ని సంపాందించుకుని జబర్దస్త్ షో కి ఎంతమంది కొత్తవాళ్లు వచ్చినా చివరి వరకు తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటూ వచ్చారు. 

చమక్ చంద్ర డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ చేస్తే అదే జరగనున్నదా?

అయితే నాగబాబు అనుకోకుండా ఈటీవీ జబర్ధస్త్‌ను వీడి జీ తెలుగు ‘అదిరింది’ ప్రోగ్రాం కి వెళ్లిపోవడంతో, ఆయన జాడలోనే నాగబాబుని నమ్ముకుని చంద్రా కూడా అక్కడికి వెళ్లిపోయాడు. అయితే, అక్కడ కూడా చంద్ర తన కామెడీ తో ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. ప్రోగ్రాం ఏదైనప్పటికీ ఆడియెన్స్‌ మాత్రం చంద్ర స్కిట్స్ కి అలవాటు పడిపోయారు. కానీ ఈ మధ్య జీ తెలుగు లో ‘బొమ్మ అదిరింది’ షో ప్రసారం అవ్వకపోవడంతో అందులోని నటుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే చంద్ర మళ్లీ తిరిగి జబర్ధస్త్‌ కు వస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇటీవల నాగబాబుతో చంద్ర కి ఓ విషయంలో విభేదాల రావడంతో వీరి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం కూడా సాగింది.

ఈ నేపధ్యం లోనే చమ్మక్ చంద్ర మళ్లీ జబర్ధస్త్‌లోకి వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై కనిపించే విషయంలో డెసిషన్ తీసుకోవడం లో చమ్మక్ చంద్ర ఇంకా ఆలస్యం చేస్తే అది ఆయన కెరీర్‌కు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని మరోవైపు కొందరు సూచిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ కమెడియన్స్ వేణు మరియు ధనరాజ్ వంటి వాళ్లే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 


Share

Related posts

KGF 2 – Salaar: ‘కేజీఎఫ్ 2′ ఎఫెక్ట్…’సలార్’ స్క్రిప్ట్‌లో భారీ ఛేంజెస్…!

GRK

Bigg boss season 5 : బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ల లిస్ట్ చూస్తే ప్రేక్షకులకు ఇక పండగే.!

Teja

SVP: 12 రోజుల్లో రూ. 200 కోట్లు.. మ‌హేశ్ అద‌ర‌గొట్టేశాడంతే!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar