NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP TDP Alliance: ఎన్డీఏలోకి తెలుగుదేశం ..? కుదిరిన అవగాహన .. సీట్ల సర్దుబాటు ఇలా..!

BJP TDP Alliance: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లతో చర్చలు జరిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కిపైగా లోక్ సభ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాత మిత్రపక్షాలన్నింటనీ తిరిగి దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో భాగంగా 2018లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన టీడీపీని తిరిగి చేర్చుకునే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే బీహార్ లో నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ లో ఆర్ ఎల్ డీ నేత జయంత్ చౌదరి ని ఎన్డీఏలో చేర్చుకున్న బీజేపీ అగ్రనేతలు రేపో మాపో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని చేర్చుకునేందుకు రందం సిద్దం చేశారు. ఇదే క్రమంలో భాగంగా టీడీపీని కలుపుకోవడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబును ఆహ్వానించగా, గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకోవడంతో ఈ ఇద్దరు నేతలు రాత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు.

ఏపీలో సీట్ల సర్దుబాటుపై అమిత్ షా, జేపీ నడ్డా లు గురువారం అర్ధరాత్రి వరకూ గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా బీజేపీకి నాలుగు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తొంది. పొత్తులో భాగంగా మూడు లోక్ సభ, 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించిన విషయాన్ని బీజేపీ అగ్రనేతలకు తెలియజేసినట్లుగా సమాచారం. అయితే ఏడు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరినట్లుగా తెలుస్తొంది.

అయితే చివరకు జనసేన – బీజేపీకి ఎనిమిది పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయింపునకు ఒప్పందం కుదిరినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. బీజేపీ – జనసేన కు అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట లోక్ సభ స్థానాలు కేటాయించినట్లుగా తెలుస్తొంది. పొత్తులపై ఒక అవగాహన కుదరడంతో మరో సారి తుది చర్చలు జరిపి ఇవేళ మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Maha Shivaratri: భక్తజన సందోహంతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N