NewsOrbit
న్యూస్

chandra babu బాబు మీ సోకులు తక్కువ కాదు !

Chandrababu : చంద్రబాబు కు సెమీ ఫైనల్స్!

chandra babu : ఒక ముఖ్యమంత్రి అన్నాక ఆయనకు చాలా కార్యకలాపాలు ఉంటాయి. ఎంతో బిజీ గా నిత్యం పని ఒత్తిడితో ఉరుకుల పరుగుల జీవితం ఉంటుంది. అలాంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ఏ సైకిల్ మీదనో లేదా వి చక్ర వాహనం మీద నో లేక కార్ లో తన ప్రయాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుంటామంటే సమయము ఒప్పుకోదు. కార్యకలాపాల బిజీ అసలు ఒప్పుకోదు. ఏమో సినిమాల్లో చూపించినట్లు అంతా నిజ జీవితంలో కూడా ఉంటుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హెలికాప్టర్ ప్రత్యేక ఫ్లైట్ లకు కేవలం 18 నెలల్లోనే రూ. 26 కోట్లు ఖర్చు చేశారంటూ, ఆ మొత్తం ఏవియేషన్ సంస్థలకు చల్ల చెల్లించాలంటూ ప్రత్యేకమైన జీవో జారీ చేయడం తో ప్రత్యేకమైన కొత్త రాగాలు కొత్త ఆరోపణలు బయలుదేరాయి.

very high budget for helicopters chandra babu
very high budget for helicopters chandra babu

టిడిపి నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అర్జెంటు గా ప్రెస్ మీట్ పెట్టి జగన్ 26 కోట్లను కేవలం హెలికాప్టర్లను ఉత్తి పుణ్యానికి కట్టబెట్టారని, ఆ డబ్బుతో సాధించింది ఏమీ లేదని, ఢిల్లీ వెళ్ళిన ఒక్క రూపాయి తీసుకు రాలేదని అంతా వృధా ప్రయాస అంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ తీవ్రమైన పదజాలంతో విమర్శించడం టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఆనందం కలిగించింది ఏమోగానీ… అసలు విషయం తెలిస్తే మాత్రం వారు ముక్కున వేలేసుకోకుండా ఉండరు.

chandra babu బాబు హయాంలో సైతం!

2014లో సైతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఏమీ బాగా లేదు అప్పుడు సైతం రెవిన్యూ లోటులోనే ఏ రాష్ట్రం ఉంది. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హెలికాప్టర్ లో ప్రత్యేక ఆఫర్ల కోసం పెట్టిన ఖర్చు 100 కోట్లు దాటింది. ఆయన మొత్తం ఐదేళ్లలో 180 సార్లు ప్రత్యేక చాపర్, హెలికాప్టర్ వాడినట్లు సమాచారం. ఆయన సైతం ఢిల్లీ కు ఇతర శుభకార్యాలకు నాయకులను పలకరింపులు సైతం ప్రభుత్వం నిధులతోనే వీటిని వాడుకున్నట్లు తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి హెలికాప్టర్ లేదా ప్రత్యేక జాఫర్ వాడుకోవడం అనేది చాలా సాధారణ విషయమే. ఏ ముఖ్యమంత్రి ఉన్నా దానిని వాడుకోవాలి ప్రజాధనం నుంచే ఏవియేషన్ సంస్థలకు నిధులు చెల్లిస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు హయాంలో జరిగిన చెల్లింపులను ఏ మాత్రం చెప్పకుండా, చంద్రబాబు చేసిన టూర్లలో ఆయన తీసుకువచ్చిన నిధులు ఎన్ని ఉన్నాయో వివరించకుండా కేవలం జగన్ 18 నెలల్లోనే 26 కోట్లు ఖర్చు పెట్టారు అంటూ టిడిపి నాయకులు చెప్పడం చూస్తే నవ్వు రాక మానదు.

5 కిలోమీటర్లకే!

చంద్రబాబు హయాంలో ఉండవలెనని తన నివాస గృహం నుంచి సచివాలయం కు సైతం హెలికాప్టర్ను వినియోగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేవలం ఐదు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ ను వినియోగించిన సీఎం కూడా చంద్రబాబే. చిన్న చిన్న కార్యక్రమాలకు చాలా దగ్గర దూరం ఉన్న కార్యక్రమాలకు సైతం చంద్రబాబు విచ్చలవిడిగా ప్రజాధనంతో హెలికాప్టర్ వినియోగించారు. రాష్ట్రానికి వచ్చే అతిథులకు సైతం సొంత ఖర్చులతోనే హెలికాప్టర్లు ఇతర సౌకర్యాలను సైతం చంద్రబాబు కల్పించారు. మరి చంద్రబాబు సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన లాభం ఎంత? రెవెన్యూ లోటు విషయంలో ఢిల్లీ వెళ్లి చంద్రబాబు సాధించింది ఎంత అనేది కూడా తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలి.

సొంత చాపర్ బెటర్!

ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి నిత్యం రాష్ట్రంలో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన హెలికాప్టర్లు ప్రత్యేకమైన ఫ్లైట్ ఏమీ లేవు. ప్రైవేట్ ఏవియేషన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. వారి వద్ద ఉన్న హెలికాప్టర్లను గంటలకు అద్దెకు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఒక ప్రైవేటు హెలికాప్టర్ టేకాఫ్ అవ్వడానికి సైతం ఎంతో ఫ్యూయల్ అవసరం. అలాగే ల్యాండింగ్కు సైతం ఎంతో ఫ్యూయల్ అవుతుంది. దీంతో చిన్నచిన్న దూరాలకు సైతం హెలికాప్టర్ ను ఉపయోగిస్తే ఏవియేషన్ సంస్థలు భారీగానే ఛార్జి చేస్తున్నాయి. ఎవరు కాదన్న ఎవరు లేదన్నా ముఖ్యమంత్రి కచ్చితంగా హెలికాప్టర్ లాంటిది ఉపయోగించి చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను మేపే కన్నా… సొంతంగా ఓ రెండు మూడు హెలికాప్టర్లను కొనుక్కొని ఉంచుకుంటే ఎంతో నిధులు ఆదా చేసినట్లే. దీనిని సూచన ప్రకారం ప్రతిపక్షం చేస్తే వారికి గౌరవం దక్కుతుంది.

author avatar
Comrade CHE

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju