NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీకి పయనమైన చంద్రబాబు, పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరువేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరూ పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు ఎన్డీఏలోనే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబుతో కలిసి ఎన్డీఏ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు పార్టీ కార్యాలయంలో జనసేన నుండి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ సమావేశమైయ్యారు. వారందరికీ అభినందనలు తెలిపారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత బాధ్యతతో కలసి పని చేయాలని వారికి పవన్ సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు.

కాగా, 9వ తేదీ ఉదయం చంద్రబాబు విభజిత ఆంధ్ర ప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటునకు అధికారులు, పార్టీ నేతలు అనువైన స్థలాన్ని పరిశీలన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఆయా పార్టీల నుండి ప్రకటన విడుదల కాలేదు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N