Chandrababu Arrest: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కేసు విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉన్నందున కేసును వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు.
ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జూషిడియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ విచారణపై స్టే విధిస్తూ గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో 17ఏ పై సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందున ఈ పిటిషన్ పై విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా, ధర్మాసనం నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకూ పీటీ వారెంట్ విచారణ పై ఇచ్చిన స్టే ఉత్తర్వులు పొడిగించింది.
Supreme Court: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరో సారి చుక్కెదురు