NewsOrbit
Featured న్యూస్

తొంగి తొంగి చూస్తున్న ‘చంద’మామ!ఇప్పుడైతే వర్కవుట్ అవుతుందని ధీమా!!

ఒకరికి శత్రువు మరొకడికి మిత్రుడు అన్న పాలసీని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరు విషయంలో కేంద్రానికి జగన్ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతున్న నేపధ్యంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పథక రచన చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు యాభై వేల కోట్ల రూపాయల అంచనాలు పంపగా కేంద్రం కేవలం నిర్మాణ వ్యయం ఇరవై వేల కోట్లు ఇస్తామని పునరావాస ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.ఈ విషయమైఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రం మొత్తం నిధులు ఇవ్వాల్సిందేనంటూ జగన్ లేఖ రాసినప్పటికీ కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు.ఒకవేళ ఈ విషయంలో జగన్ గనుక మెతక వైఖరి అవలంభించి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.అదే సమయంలో కేంద్రం మెడలు వంచే పరిస్థితుల్లో జగన్ కూడా లేరు అన్నది నిర్వివాదాంశ౦. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన వ్యూహానికి పదును పెట్టారట.

నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి చంద్రబాబుకు బీజేపీతో మళ్లీ చెలిమి చేయాలని మహా తపనగా ఉంది.సింగిల్ గా టీడీపీ వైసిపిని ఎదుర్కునే పరిస్థితుల లో లేదనిగుర్తించిన చంద్రబాబు బిజెపి తో పొత్తు పెట్టుకొని రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.అయితే ఇన్నాళ్లు బీజేపీ చంద్రబాబు పట్ల వ్యతిరేక ధోరణి అవలంబించింది.మరోవైపు జగన్ బీజేపీ అడక్కపోయినా కేంద్రానికి పార్లమెంటులో మద్దతు ఇవ్వటం వంటి చర్యలు చేపట్టి ప్రధాని మోడీకి సన్నిహితంగా మెలిగారు.జగన్ మోదీల మధ్య బంధం పటిష్టమవడంతో తానేమీ చేయాలన్న తలంపుతో ఉన్న చంద్రబాబుకు పోలవరం ఆశాకిరణంగా కనిపించింది.పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరుకు సంబంధించి కేంద్ర నిర్ణయాన్ని ఏ మాత్రం చంద్రబాబు వ్యతిరేకించడం లేదు.

ఎంతసేపు పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తప్పులను మాత్రమే ఎత్తిచూపుతూ రాష్ర్టానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు.ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టడమనే కాన్సెప్టుతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.రాష్ర్టంలోనేమో పోలవరం విషయంలో జగన్ వైఖరిని ఎండగడుతూ, కేంద్రంలో మాత్రం బీజేపీ వ్యవహారశైలిని అభ్యంతర పెట్టకుండా చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ గనుక మొండిగా కేంద్రంతో ఘర్షణకు దిగితే బీజేపీ ఆయనకు దూరం అవుతుందని ఆ సందులో తాను దూరి బిజెపి జనసేన టిడిపి కూటమి కట్టి రాజకీయంగా జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలన్నది చంద్రబాబు ప్లాన్ అంటున్నారు.అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N