NewsOrbit
న్యూస్

బాబుగారికి తెలియకుండానే జగన్ తన పద్మవ్యూహంలోకి లాగేశాడు!

సాధారణంగా రాజకీయాల్లో ఏ పార్టీ వ్యూహాలు వారికుంటాయి.. ఏ పార్టీ హామీలు వారికి ఉంటాయి.. ఎవరి బ్యాక్ బోన్ వర్గం వారి కుంటుంది.. ఫలితంగా వాటికి అనుగుణంగానే వారి ఎన్నికల ప్లాన్స్ ఉంటుంటాయి. ఈ క్రమంలో ఏ రాజకీయ పార్టీ అయితే తన ప్రత్యర్ధి పార్టీ స్టైల్లో ఆలోచించాలని అనుకుంటుందో… అక్కడితో వారి ఫెయిల్యూర్ స్టార్ అయినట్లే కాదు.. పతనం కూడా మొదలయినట్లే!!

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ ఎన్ని హామీలు ఇచ్చారు.. వాటిలో ఎన్ని హామీలను నెరవేర్చారు.. దాదాపు అందరికి తెలిసిన విషయమే! ఈ క్రమంలో జనం నమ్మడం సంగతి దేవుడెరుగు.. అసలు బాబు రాబోయే ఎన్నికల్లో ఇంకేమి హామీలిచ్చి ప్రజల్లోకి వెళ్లాలి! రుణాలు మాఫీనా… ఆపేరెత్తితే జనాలు కొడతారు! నిరుద్యోగ భృతా… కుర్రాళ్లు ఎగురి మరీ…! కలల రాజధాని… పేరులోనే ఉందిగా “కల” అని! డ్వాక్రా రుణాలు… నమ్మరుగా! అభివృద్ధి చేస్తామంటే… జనాలు విసిగిపోయారుగా! లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే… నవ్విపోదురుగా! మరి ఇంకేమి ఇవ్వాలి!!

ఈ సమయంలో జగన్ నవరత్నాల బుక్ వైపు చూస్తున్నారంట చంద్రబాబు! దస్తాలు దస్తాలు, రీములు రీములు పేపర్ వాడకుండా… కేవలం ఒక్క కాగితంలో “నవరత్నాలు” అని ముద్రించి బ్రహ్మాస్త్రాన్ని వదిలారు జగన్. ఆ అస్త్రం కాస్తా బాబుగారి కోటను చిధ్రం చేసేసింది! పైగా ఆ నవరత్నాలు అన్నింటినీ జగన్ తొలి ఏడాది లోనే చేసి చూపించేశారు కూడా! కాబట్టి.. కాస్త అటు ఇటుగా రాబోయే ఎన్నికల్లో తాను కూడా ఇలా సింపుల్ గా ఒక ప్లాన్ చేయాలని, కానీ అది చాలా పవర్ ఫుల్ గా ఉండాలని భావిస్తున్నారంట. దీంతో… జగన్ పద్మవ్యూహంలోకి బాబు వచ్చిపడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్కోడి కాగితం చూడటం అలవాటు చేసుకుంటే.. సొంత ఆలోచనలు పక్కదారి పట్టడమే కాదు, కొంతకాలానికి కనుమరుగైపోతాయి కూడా!!

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju