Kuppam: కుప్పకూలుతున్న కుప్పం కోట..సురక్షిత నియోజకవర్గం కోసం బాబు వేట !!

Share

Kuppam: తన కుప్పం కోట కుప్పకూలిపోతుండటంతో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సురక్షితమైన అసెంబ్లీ నియోజకవర్గం కోసం అన్వేషణ మొదలు పెట్టినట్టు పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది.

Chandrababu Naidu loosing Kuppam and searching for new constituency
Chandrababu Naidu loosing Kuppam and searching for new constituency

1989 నుండి ఇప్పటివరకు చంద్రబాబును ఏడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దాదాపు పతనావస్థకు చేరుకోవడమే ఇందుకు కారణం.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబు మెజారిటీ దారుణంగా పడిపోయి ముప్పై వేలతో మాత్రమే ఒడ్డెక్కారు.ఇక తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో వైసిపి విజయదుందుభి మోగించగా టిడిపి దారుణంగా ఓడిపోయింది.తాజాగా జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితం రానుండటంతో చంద్రబాబు తన రాజకీయ భవితవ్యంపై అతలాకుతలం అవుతున్నారని సమాచారం.ఇప్పటి నుండే కుప్పం కు ప్రత్యామ్నాయ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నుకోవడం మంచిదన్న నిర్ణయానికి నారావారు వచ్చేసినట్లు భోగట్టా

చంద్రగిరి టు కుప్పం!

నియోజకవర్గం మారడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు.1978లో ఆయన తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు.ఏకదమ్మున మంత్రి కూడా అయ్యారు.అయితే 1983 ఎన్నికల సమయానికి చంద్రబాబు మామగారైన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఆ ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి చంద్రగిరిలో ఓడిపోయారు.తదుపరి టిడిపిలో ఆయన చేరినప్పటికీ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే పనిలో పడ్డారు.తద్వారా పార్టీపై పట్టు కూడా సాధించారు.1989 ఎన్నికల్లో చంద్రగిరి కి గుడ్ బై చెప్పి ఆయన కుప్పంలో ప్రవేశించారు.ఆనాటి నుండి మొన్నటి ఎన్నికల వరకు కుప్పం లో గెలుస్తూ వస్తున్నారు.కానీ ఈ మధ్య పరిస్థితి తారుమారైంది.

Kuppam: కుప్పం ను టార్గెట్ చేసిన వైసిపి!

చంద్రబాబు ఎదురులేకుండా గెలుస్తూ వస్తోన్న కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ వ్యూహాత్మకంగా టార్గెట్ చేసింది.చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు కుప్పంలో తరచూ పర్యటిస్తూ వైసీపీ అనుకూల వాతావరణం సృష్టించారు.ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైసిపికి అనుకూలంగా వచ్చాయి.

పెనమలూరు వైపు బాబు చూపు?

మొత్తంగా చూస్తే కుప్పంలో ఇక తన పప్పులు ఉడికేలా లేవన్న విషయాన్ని చంద్రబాబు అర్థం చేసుకుని వేరే నియోజకవర్గం కోసం వేట మొదలెట్టారని తెలియవస్తోంది.ప్రస్తుతానికైతే ఆయన దృష్టి కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం మీద పడింది అంటున్నారు.కమ్మ సామాజికవర్గం అధికంగా ఉండే పెనమలూరు అయితే తనకు సేఫ్ అని ఆయన భావిస్తున్నారట.భవిష్యత్తులో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారనేది పక్కనబెడితే కుప్పం ను వదిలేయటం మాత్రం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు ఏం జరుగుతుందో చూడాలి.

 


Share

Related posts

 Anil ravipudi : అనిల్ రావిపూడి శర్వానంద్‌కి హిట్ ఇవ్వగలరా..?

GRK

జగన్ తో భేటీ !

somaraju sharma

Malavika mohanan beautiful images

Gallery Desk