NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు సినిమా

Chandrababu Naidu : సినిమాపై చంద్రబాబు ప్రేమ అప్పుడలా.. ఇప్పుడిలా..!

chandrababu naidu on cinema then and now

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు Chandrababu Naidu: పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లతోపాటు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపింది. దానికి కారణం ఏపీ ప్రభుత్వమే. సినిమా రిలీజ్ ఉందని తెలిసీ ఫ్యాన్స్ బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ముందే చెప్పకుండా.. రిలీజ్ ముందురోజు అర్ధరాత్రి జీవో ఇచ్చి అడ్డుకుంది. మొదటి మూడు రోజులు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హైకోర్టు అంగీకరించినా కాదంది. దీంతో పెద్ద వివాదమే జరిగింది. ప్రభుత్వంపై ఫ్యాన్స్ ఆగ్రహం పెల్లుబికింది. కొన్నిచోట్ల ధియేటర్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రాజకీయంగా కూడా దుమారం రేగడంతో తిరుపతిలో బీజేపీ నిరసన చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే..

chandrababu naidu on cinema then and now
chandrababu naidu on cinema then and now

ఇక్కడ చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెం.150 విడుదలైంది. ఒక్కరోజు తేడాలో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా విడుదలైంది. అయితే.. ఆ సమయంలో చిరంజీవి సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కానీ.. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కానీ పర్మిషన్ ఇవ్వలేదు టీడీపీ ప్రభుత్వం. చివరికి విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఫంక్షన్ చేశారు. సినిమా రిలీజ్ సమయంలో కూడా కొన్నిచోట్ల బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. 2018లో విడుదలైన బాలకృష్ణ జై సింహా సినిమా ఫంక్షన్ మాత్రం విజయవాడలోనే జరిగింది.

 

గౌతమీపుత్రకు పన్ను మినహాయింపు ఇచ్చిన చంద్రబాబు.. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవికి మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వలేదు. పైగా.. మహానటి సినిమాకు నిర్మాత అశ్నీదత్ అడక్కుండానే పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఇందుకు అశ్వనీదత్ తిరస్కరించారు. అశ్వనీదత్ టీడీపీ సానుభూతిపరుడు.. బాలకృష్ణతో బంధుత్వం కారణంగానే చంద్రబాబు ఇలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు కోరుతూ గుణశేఖర్ లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా అలా.. లేనప్పుడు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చంద్రబాబుపై వస్తున్నాయి. జనసేనతో రాజకీయ స్నేహం కోరే చంద్రబాబు మాట్లాడారనే వ్యాఖ్యలూ లేకపోలేదు. దీనికి సమాధానం కూడా చంద్రబాబు వద్దే ఉంటుంది.

author avatar
Muraliak

Related posts

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri