రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు… శాశ్వత శత్రువులు ఉండరు…! అలాగే బంధుత్వం అయినా రాజకీయ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుంది…!! ఈ క్రమంలోనే చంద్రబాబు గాలి తెసేసేస్తున్న ఆ బంధుత్వం, ఆ అంతర్గత విషయాలు వెల్లడిస్తున్న ఆ బంధం ఏమిటో చూడండి.
సొంత అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఉదంతాలున్నాయి. అలాగే తోడల్లుళ్లు వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఒకరినొకరు కత్తులు దూసుకున్న ఉదంతాలూ ఉన్నాయి. దీనికి అందరికీ తెలిసే ఉదాహరణ చంద్రబాబు – దగ్గుబాటి వెంకటేశ్వరరావుల బంధమే. ఇద్దరూ తోడల్లుళ్లే. కొన్నాళ్ళు ఒకే పార్టీలో ఉన్నారు, కలిసే పని చేసారు. కానీ ఇద్దరి భావాలూ వేరు, ఇద్దరి ఆలోచనలు వేరు. చంద్రబాబు పదవి కోసం, పట్టు కోసం చూస్తే… దగ్గుబాటి తన మార్కు కోసం, తన సిద్ధాంతాల కోసం చూసుకున్నారు. అందుకే చంద్రబాబు టీడీపీ అధినేతగా మారారు. సీఎం అయ్యారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పటికే బాబు సిద్ధాంతాలు, విలువలపై అనేక సందేహాలే. కానీ దగ్గుబాటి మాత్రం పలు పార్టీలు మారి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, రాజ్యసభ సభ్యుడిగా పలు హోదాలో ఉన్నారు.
దగ్గుబాటి మూలల్లోకి వెళ్తున్నారు…!!
ఇంతకూ ఇప్పుడు ఇది ఎందుకు అనే సందేహం రావచ్చు. దగ్గుబాటి గురించి తెలిసే ఉంటుంది. ఆయన రచయిత, పుస్తకాలు రాస్తుంటారు. ఇప్పుడు కొత్త దారిలోకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుకయ్యారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ చరిత్ర…, పార్టీ ఏర్పాటు, మొదటి ఎన్నికలు, ప్రచారం, చంద్రబాబు రాక, బాలకృష్ణ పెళ్లి… ఇలా పార్టీలో ప్రతీ అంశాన్ని చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు రాస్తున్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేస్తున్నారు. దీనికి ఆయన ఫాలోయర్లు నుండి మంచి స్పందన వస్తుంది. అయితే పోస్టుకి వస్తున్న ప్రతీ కామెంట్ కీ ఆయన రిప్లై ఇస్తున్నారు. ఎవరు, ఏ ప్రశ్న వేసినా సమాధానాలు ఇస్తున్నారు.
బాబు విషయంలో కొన్ని నిజాలు…!!
ఇక్కడే చంద్రబాబు విషయంలో కొన్ని సూటి నిజాలను పోస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు టిడిపిలోకి ఏ సందర్భంలో వచ్చారు అనేది వివరించారు. ఇది ఈ తరంలో చాలా మందికి తెలియని అంశం. 1983 లో ఎన్నికలు ముగిసిన వెంటనే అంటే ఎన్టీఆర్ సీఎం అయిన కేవలం 15 రోజుల్లోనే చంద్రబాబు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఆ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ పై పోటీకి సిద్ధమని ప్రకటించిన చంద్రబాబు… చివరికి సొంత నియోజకవర్గం చంద్రగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ హవాతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మామగారితో కలవడానికి చంద్రబాబు ముందుకు వచ్చారు. దీంతో పార్టీలో పలువురు వ్యతిరేకించారు. ఎన్టీఆర్ ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కమిటీ చర్చలు సమయంలోనే, కొందరు వ్యతిరేకిస్తున్న సమయంలోనే ఇక చంద్రబాబు మరింత వేగంగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసి పార్టీలో చేరిపోయారు. ఎన్టీఆర్ కి ఉన్న బంధు ప్రీతి, కుటుంబ బలహీనత కారణంగా అంగీకరించారు అంటూ దగ్గుబాటి రాసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు పార్టీలో ఎలా ఎదిగారు. ఎలా చేజిక్కించుకున్నారు. అనేది తెలిసిందే. ఇలా దగ్గుబాటి తన పోస్టుల ద్వారా కొన్ని నిజాలు వెల్లడిస్తూ చంద్రబాబు గాలి తీసేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?