అతనికి కరోనా పాజిటివ్… బిత్తర పోతున్న చంద్రబాబు ..??

Share

కరోనా వైరస్ భయం ప్రజలలో అంతగా లేకపోయినా గానీ మరోపక్క దాని పని అది చేసుకుంటూ పోతోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్న తరుణంలో జనాలు పెద్దగా భయపడటం లేదు. దీంతో చాలా వరకు కరోనా నిబంధనలు కూడా తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క పేదవాని మొదలుకొని దేశ ప్రధానులు సెలబ్రిటీలను ఎవరిని విడిచి పెట్టడం లేదు ఈ మహమ్మారి.

TDP leader Somireddy Chandramohan Reddy hails Supreme Court's remark on SC/ST quotaతాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్ రావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు లో టెన్షన్ నెలకొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స, విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల తనని కలిసిన ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా సూచించారు.

 

గత కొన్ని రోజుల నుండి పార్టీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటనలు చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కరోనా సోకినట్లు వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల విజయవాడ లో తిరుపతి పార్లమెంటు సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు తో అంతకు ముందు పోలిట్ బ్యూరో సమావేశం సమయంలో చంద్రబాబుతో భేటీ కావడంతో వీళ్ళిద్దరికి టెన్షన్ పట్టుకున్నట్లు టిడిపి పార్టీలో అంతర్గతంగా టాక్ వస్తుంది. సోమిరెడ్డి కి కరోనా అనే వార్త వినేసరికి బాబు వెన్నులో వణుకు మొదలైనట్లు టిడిపి పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.


Share

Related posts

Cinema posters: శ్రీరామనవమికి విడుదలైన పోస్టర్స్ చూశారా..!!

bharani jella

కమ్మేసిన మంచు- ఏడుగురు మృతి

Siva Prasad

Nara Lokesh: “లొకేషన్ కో లోకేష్” “లోకేశానికి ఆవేశం” – అజ్ఞానావేశమా..? అర్దావేశమా..!? అత్యావేశమా..!?

Srinivas Manem